Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఉచిత విద్య అందిస్తే తప్పేంటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే, మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వాలని, సామాన్య ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన నిలదీశారు. గుజరాత్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్తు, విద్య వంటి వాటిని ఉచితంగా అందించే విషయంపై పలు హామీలు ఇచ్చింది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండడంతో కేజ్రీవాల్ నేడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal to centre: ఉచిత విద్య అందిస్తే తప్పేంటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే, మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వాలని, సామాన్య ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన నిలదీశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ఉచితాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. గుజరాత్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్తు, విద్య వంటి వాటిని ఉచితంగా అందించే విషయంపై పలు హామీలు ఇచ్చింది.

దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండడంతో కేజ్రీవాల్ నేడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘ఉచితంగా విద్య, విద్యుత్తు, నీళ్ళు అందించడం నేరమనే విధంగా వాతావరణాన్ని సృష్టించారు. బీజేపీ మాత్రం కొందరికి సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసింది. వారిలో కొందరు బీజేపీ మిత్రులే ఉన్నారు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఉచిత విద్య, విద్యుత్తు, నీళ్ళు వంటివి మాత్రం ఉచితంగా ఇవ్వడం ఏంటని అంటున్నారు’’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీని ‘దోస్త్‌వాద్’ (మిత్రులకు లాభం కలిగేలా చేయడం) అని, కాంగ్రెస్‌ను పరివార్‌వాద్ (వారసత్వ రాజకీయాలు) అని కేజ్రీవాల్ వర్ణించారు. తమ పార్టీ మాత్రం భారత్‌వాద్ కు దారి చూపుతోందని చెప్పుకొచ్చారు. కాగా, గుజరాత్ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది. ఢిల్లీ మోడల్ ను గుజరాత్ లో తీసుకు వస్తామని చెప్పింది. అయితే, ఉచితాలపై ప్రధాని మోదీ కూడా ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Sanjay Raut Judicial Custody: 22 వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి ఎంపీ సంజ‌య్ రౌత్‌