Netflix Users : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై సింగిల్ క్లిక్‌తో మీ అకౌంట్లో ఇతరుల డివైజ్‌లను లాగౌట్ చేయొచ్చు!

Netflix Users : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) విధానాలలో గణనీయమైన మార్పులు చేసింది. భారీ నష్టాల కారణంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగిస్తున్న మల్టీ యూజర్లను నివారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Netflix Users : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) విధానాలలో గణనీయమైన మార్పులు చేసింది. భారీ నష్టాల కారణంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగిస్తున్న మల్టీ యూజర్లను నివారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లాగిన్‌లను మరో విధంగా నిర్వహించనుంది. Netflix యూజర్లు ఇప్పుడు ఎక్కడి నుండైనా ఏ డివైజ్‌తోనైనా ఒకే క్లిక్‌తో ఎవరినైనా సైన్ అవుట్ (Sign Out) చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం.. రిమోట్‌గా లాగ్ అవుట్ చేసే ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ ద్వారా ఎక్కడ ఉన్నా నెట్ ఫ్లిక్స్ అకౌంట్లో మరొకరి లాగిన్ యాక్సస్ సింగిల్ క్లిక్‌తో లాగౌట్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ‘Managing Access and Devices’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. నవంబర్ 15, 2022న కొత్త అకౌంట్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా చేయవచ్చు. Netflix బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం మీ స్ట్రీమింగ్ సర్వీస్ అకౌంట్ ఉపయోగిస్తున్న అన్ని డివైజ్‌లను చూసేందుకు వీలు కల్పిస్తుంది.

మీరు మీ అకౌంట్‌ను ఒక క్లిక్‌తో లాగ్ అవుట్ చేయవచ్చు. బిజీ హాలిడే సీజన్‌తో నెట్‌ఫ్లిక్స్ మెంబర్స్ కుటుంబం, స్నేహితులతో కలిసి చూసేందుకు ఎక్కడికి వెళ్లినా నెట్‌ఫ్లిక్స్‌ లాగిన్ కావొచ్చు. అలాగే హోటల్‌లో ఉన్నప్పుడు లేదా మీ స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ అకౌంట్లో లాగిన్ చేయవచ్చు.

Netflix Users can now sign someone out with a single click

కానీ అప్పుడప్పుడు యూజర్లు తమ అకౌంట్ లాగ్ అవుట్ చేయడం మరిచిపోతుంటారు. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఆయా యూజర్లను అకౌంట్ యాక్సస్ సింగిల్ క్లిక్‌తో డివైజ్ నుంచి లాగౌట్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ అకౌంట్ సెట్టింగ్‌లలో అందుబాటులో ఉంది. మీ అకౌంట్ నుంచి యాక్సస్ అందించిన ఇటీవలి డివైజ్‌లను కూడా సులభంగా చెక్ చేయవచ్చు.

కేవలం ఒక క్లిక్‌తో నిర్దిష్ట డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుందని Netflix బ్లాగ్ పోస్ట్ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ గత నెలలో పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవడాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇందులో ఒక కారణమని తెలిపింది. త్రైమాసిక ఆదాయాల కాల్ సమయంలో స్ట్రీమింగ్ సర్వీస్ 2023 నుంచి లాగిన్ ID, పాస్‌వర్డ్‌ను షేర్ చేసే యూజర్ల నుంచి అదనపు రుసుములను వసూలు చేస్తుందని ప్రకటించింది. అకౌంట్ షేరింగ్ తగ్గించడంపై కూడా నెట్‌ఫ్లిక్స్ ఆదాయ నివేదికలో పేర్కొంది, నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్‌ను మానిటైజ్ చేసేందుకు ఆలోచనాత్మకమైన విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Bigbasket : 2022లో 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ పాస్‌వర్డ్ వాడుతున్నారట.. టాప్ 10 కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే..!

ట్రెండింగ్ వార్తలు