Bigbasket : 2022లో 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ పాస్‌వర్డ్ వాడుతున్నారట.. టాప్ 10 కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే..!

Bigbasket : 2022లో చాలామంది యూజర్లు ఇప్పటికీ చెత్త పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతి ఏడాదిలో ఆన్‌లైన్ యూజర్ల బలహీనమైన పాస్‌వర్డ్‌లకు సంబంధించి సర్వే ఒక జాబితాను రిలీజ్ చేస్తోంది.

Bigbasket : 2022లో 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ పాస్‌వర్డ్ వాడుతున్నారట.. టాప్ 10 కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే..!

Over 75,000 Indians using Bigbasket as password in 2022 Check top 10 most common passwords

Bigbasket : 2022లో చాలామంది యూజర్లు ఇప్పటికీ చెత్త పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతి ఏడాదిలో ఆన్‌లైన్ యూజర్ల బలహీనమైన పాస్‌వర్డ్‌లకు సంబంధించి సర్వే ఒక జాబితాను రిలీజ్ చేస్తోంది. బలహీనమైన పాస్‌వర్డ్ లేదా సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లతో హ్యాకర్‌లు మీ డేటాను దొంగిలించే రిస్క్ ఉంటుంది. NordPass 2022 వార్షిక అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌ల లిస్టును ఇటీవలే షేర్ చేసింది. భారతీయ యూజర్లలో దాదాపు 3.5 లక్షల మంది సైన్ అప్ చేసేందుకు పాస్‌వర్డ్‌గా ‘Password’ని ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. అంతేకాదు.. బిగ్‌బాస్కెట్‌ను 75,000 మందికి పైగా భారతీయులు తమ పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాదిలో టాప్ 10 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు 123456, bigbasket, పాస్‌వర్డ్, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummyలను ఈ పాస్‌వర్డ్‌లను వేలాది మంది యూజర్లు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. భారత్‌లోనే కాకుండా దాదాపు 30 దేశాల్లో ఈ పరిశోధన జరిగింది. Guest vip, 123456, మరిన్ని వంటి పాస్‌వర్డ్‌లను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Over 75,000 Indians using Bigbasket as password in 2022 Check top 10 most common passwords

Over 75,000 Indians using Bigbasket as password in 2022

ప్రతి ఏడాదిలో రీసెర్చర్లు ఒకే ప్యాట్రన్ వినియోగిస్తున్నారు. అందులో క్రీడా బృందాలు, సినిమా రోల్స్, ఫుడ్ ఐటెమ్స్ ప్రతి పాస్‌వర్డ్ లిస్టులో ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ వర్గాల్లో పాపులర్ పేర్లను ఉపయోగిస్తున్నారు. చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లు, హ్యాకర్లకు మరింత ఈజీగా మారిపోయిందని సైబర్ నిపుణులు అంటున్నారు. అందుకే పాస్‌వర్డ్ ఎల్లప్పుడూ స్ట్రాంగ్ ఉండేలా చూసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.

మీరు మీ అకౌంట్లను ఎలా సేఫ్‌గా ఉంచుకోవచ్చు? పాస్‌వర్డ్ బేసిక్స్ ఏమిటి?

– వివిధ అల్ఫాబెట్, సైన్, సంఖ్యలతో సంక్లిష్టమైన లాంగ్ పాస్‌వర్డ్‌లను వాడాలని యూజర్లకు సూచిస్తోంది.
– ఉదాహరణకు, ఒక యూజర్ తమ పాస్‌వర్డ్ “@s1Q0#+Ga@os”ని ఉపయోగించవచ్చు.
– యూజర్లు అన్నింటిని ఒకే పాస్ వర్డ్ లో వచ్చేలా చూసుకోవాలి.
– అలాంటి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమే. కానీ, కనీసం మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.
– యూజర్లు ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి.
– ఎందుకంటే కొన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం మంచి పద్ధతి కాదు.
– మీ పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడం, అకౌంట్ యాక్సెస్ చేయడం హ్యాకర్‌కు ఈజీగా మారుతుంది.

Over 75,000 Indians using Bigbasket as password in 2022 Check top 10 most common passwords

Over 75,000 Indians using Bigbasket as password in 2022 

– యూజర్లు క్రియేట్ లేదా సైన్ అప్ చేస్తున్న ప్రతి అకౌంట్ two-step verification ఉపయోగించాలి.
– ఈ ఫీచర్ ఈ రోజుల్లో ప్రతి ఇతర సర్వీసుల ద్వారా అందుబాటులో ఉంది
– తెలియని వారి కోసం.. మీకు కాకుండా ఎవరికీ తెలియని secondary PINని సెట్ చేయడానికి ఫీచర్ అనుమతిస్తుంది.
– Google వంటి కంపెనీలు రియల్ టైమ్ ప్రాతిపదికన సైన్-ఇన్ చేసేందుకు అనుమతించమని ప్రాంప్ట్‌లను అందిస్తాయి.
– మీరు ప్రతి నెలా మీ పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేయలేకపోతే.. కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి చేయండి.
– నెలవారీగా పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం తప్పనిసరిగా చేయాలి.
– యూజర్లు ఎలాంటి పాస్‌వర్డ్‌ను మళ్లీ ఉపయోగించవద్దని సూచించారు.
– యూజర్లు పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించవచ్చు లేదా వాటిని నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple IPhone Manufacturing IN India: బెంగళూరులో యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్ .. 60 వేల మందికి ఉపాధి : మంత్రి అశ్విని వైష్ణవ్