Apple IPhone Manufacturing IN India: బెంగళూరులో యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్ .. 60 వేల మందికి ఉపాధి : మంత్రి అశ్విని వైష్ణవ్

యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్‌ను బెంగళూరులోని హోసూర్‌లో త్వరలో ప్రారంభమవుతుందని టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.

Apple IPhone Manufacturing IN India: బెంగళూరులో యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్ .. 60 వేల మందికి ఉపాధి : మంత్రి అశ్విని వైష్ణవ్

Apple's iPhone Manufacturing Unit IN Inida

Apple’s iPhone Manufacturing Unit IN Inida : యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్‌ను బెంగళూరులోని హోసూర్‌లో త్వరలో ప్రారంభమవుతుందని టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభిస్తుందని మంగళవారం (నవంబర్ 15,2022) జాతీయ గౌరవ్ దివస్ వేడుకలో మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ శుభవార్తను వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో దేశంలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ తమ కార్యకలాపాలను నాలుగు రెట్లు విస్తరించే యోచనలో ఉన్నట్లు రూటర్స్‌ కథనాలు వెల్లడించాయి.

“Apple’s iPhone ఇప్పుడు భారతదేశంలో తయారవుతోందని..ఇప్పటికే బెంగళూరులో నెలకొల్పనున్న ఐఫోన్‌ల తయారీలో రాంచీ, హజారీబాగ్‌ల సమీప ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరు వేల మంది గిరిజన మహిళలు శిక్షణ పొందారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బెంగళూరులోని హోసూర్‌లో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ నుంచి అవుట్‌సోర్స్ ద్వారా యాపిలో ఐఫోన్ ఎన్‌క్లోజర్‌లను తయారు చేస్తోంది.

ఇదికాకుండా దేశంలోని యాపిల్ ఐఫోన్‌లను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. ఫాక్స్‌కాన్ ఇండియాలో తొలిసారిగా 2019లో ప్లాంట్‌ను ప్రారంభించింది. చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీ అయిన ‘జెంగ్‌జౌ ప్లాంట్‌’ గత రెండేళ్లుగా వరుస కోవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల ఐఫోన్ల తయారీకి ఆటంకం కలుగుతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రొడక్షన్ యూనిట్ గతంలో వెల్లడించించి కూడా. ఈ లోటును భర్తీ చేసుకొనేందుకు ఇప్పుడు భారతదేశంలో కూడా తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

రానున్న రెండేళ్లలో బెంగళూరులో స్థాపించనున్న ఐఫోన్ తయారీ యూనిట్‌లో53,000ల మందికి ఉపాధి కల్పించడం ద్వారా, అక్కడి వర్క్‌ఫోర్స్‌ను 70,000కి పెంచాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఐఫోన్ 14 లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.