NGRI study in Himalayas
NGRI Study In Himalayas : హైదరాబాద్ కేంద్రంగా భౌగోళిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్జీఆర్‌ఐ మరో కీలక అంశంపై పరిశోధనలు చేస్తోంది. ఎన్నో జీవనదులకు కేంద్రమైన హిమాలయ పర్వతాల అడుగున ఉన్న భూకంప కేంద్రాలు, ఖనిజాల అధ్యయనం, వేడి నీటి సరస్సుల మిస్టరీని తేల్చనుంది.
లేహ్‌లడక్ లాంటి పర్వత ప్రాంతాల్లో సర్వే చేయడానికి అత్యాధునిక డ్రోన్లను వినియోగించింది. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పే స్ ల్యాబోరేటరీ సహకారంతో సర్వే చేశారు. గడ్డ కట్టే మంచు ప్రాంతంలో వేడి నీటి సరస్సులకు హిమాలయాలు కేంద్రంగా ఉన్నాయి.
అంతు చిక్కని ఈ సరస్సులను పరిశీలించేందుకు మ్యాగ్నటిక్ సర్వే సాయపడుతుందని చెప్తున్నారు. లేహ్ ప్రాంతంలో చుమతాంగ్, పనామిక్, పుగా వంటి సరస్సుల్లో ఓవైపు మంచు కురుస్తున్న వేడి నీరు ప్రవహిస్తుందని పరిశోధకులు వివరించారు. మిస్టరీని గుర్తిస్తే మరింత లోతుగా భూ భౌగోళిక అంశాల పరిశీలనకు అవకాశం ఉంటుందంటున్నారు.