Mystery Mountain : మానవుడు ఇప్పటి వరకు అడుగు పెట్టని పర్వతం..! అందంగా కనిపించే ఈ పర్వతం వెనుకున్న రహస్యమేంటీ..?!!

ప్రపంచంలో మనిషి అడుగు పెట్టని పర్వతం ఏదైనా ఉందా..? సాహసికుడు పాదం మోపని పర్వత శిఖరం ఉందా...? అంటే కైలాస పర్వతం అనే అంటారు. కానీ ఈ కైలాస పర్వతం కాకుండా మరో పర్వతం ఉంది. ఆ పర్వతంపై కాలు మోపినవారు ఎవ్వరు ప్రాణాలతో లేరు. ఆ రహస్యమేంటీ? అక్కడ మనిషి కాలుపెడితే ఏమవుతుంది. ఆ పర్వతానికి ఆ మహాశివుడికి సంబంధం ఏంటి...?ఆ దేశ ప్రభుత్వం కూడా ఆ పర్వతం జోలికి వెళ్లకపోవడం వెనకున్న మిస్టరీ ఏంటి...?

Mystery Mountain : మానవుడు ఇప్పటి వరకు అడుగు పెట్టని పర్వతం..! అందంగా కనిపించే ఈ పర్వతం వెనుకున్న రహస్యమేంటీ..?!!

Mystery Mountain : ప్రపంచంలో మనిషి అడుగు పెట్టని పర్వతం ఏదైనా ఉందా..? సాహసికుడు పాదం మోపని పర్వత శిఖరం ఉందా…? మనకు వినిపించే పేరు కైలాస పర్వతం… అది కాకుండా మరే పర్వతం లేదా…? అంటే సమాధానం ఉంది. అదే నేపాల్ లోని మచ్చాపుచ్చారే.. మరి దానిపైకి ఎవరూ ఎందుకు కాలుమోపలేదు…? ఆ పర్వతానికి ఆ మహాశివుడికి సంబంధం ఏంటి…? నేపాల్ ప్రభుత్వం ఆ పర్వతం జోలికి వెళ్లకపోవడం వెనకున్న మిస్టరీ ఏంటి…?

హిమాలయాలు…. నిత్యం హిమంతో నిండిన మహా పర్వత శిఖరాలు… ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మలు… జీవనదులకు మూలస్థానాలు… మేఘాలు తాకే శిఖరాలు… అంతేనా…? కచ్చితంగా కానే కాదు… అనంత రహస్యాలను తమలో దాచుకున్న అద్భుతాలు హిమాలయాలు… అవి కేవలం మంచుకొండలు కాదు భారతీయ ఆధ్యాత్మిక శిఖరాలు… హిమాలయాల గురించి మనకు తెలిసింది గోరంత… తెలుసుకుంటూ పోతే ఈ మహా పర్వతాల్లో ఇమిడిపోయిన ఎన్నో మరెన్నో అంతుచిక్కని రహస్యాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి…హిమాలయాలు మహాశివుని ఆవాసం అన్నది హిందువుల నమ్మకం.. కైలాస్ సరోవర్, అమర్ నాథ్ ఈ రెండుచోట్ల మహాశివుడు ఉంటాడని గట్టిగా నమ్ముతాం. కానీ ఈ రెండూ కాకుండా మహాశివుడు నివాసం ఉన్నట్లు చెప్పే మరో పర్వతం ఉంది. అదే మచ్చాపుచ్చారే… నేపాల్ లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల్లోని మూడింటిలో ఇది ఒకటి…

Mystery Machapuchare : కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణం అదేనా..?

మధ్య నేపాల్ లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల్లోనే ఈ మచ్చాపుచ్చారి ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 10 పర్వత శిఖరాల్లో మూడు ఈ శ్రేణిలోనే ఉన్నాయి. కానీ ఎత్తైన ఆ మూడు పర్వతాలకు దూరంగా ఒంటరిగా నిలుచున్న త్రిభుజాకార శ్వేత పర్వతం ఈ మచ్చాపుచ్చారి. మచ్చాపుచ్చారీ అంటే నేపాలీ భాష ప్రకారం చేపతోక. పశ్చిమం వైపు నుంచి చూస్తే ఇది చేపతోకలాగానే కనిపిస్తుంది. అందుకే ఆ పేరు వచ్చింది. మిగిలిన వాటికి దూరంగా ఉండటం, భౌగోళిక అనుకూలతల వల్ల దీన్ని అన్ని వైపుల నుంచి చూడొచ్చు… ఏ కోణంలోంచి చూసినా అత్యంత అందంగా కనిపించే శిఖరం ఇది. కానీ ఇది చూడటానికే పరిమితం. దీనిపై అడుగుపెట్టడం నిషిధ్దం…

నేపాల్ ప్రభుత్వం ఈ పర్వతారోహణను నిషేధించింది. బేస్ క్యాంప్ వరకే ఎవరైనా వెళ్లగలరు. … అది దాటి పైకి అడుగు ముందుకు వేయడం నేరం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8వేల 848 మీటర్ల ఎత్తు.. మరి మచ్చాపుచ్చారి ఎత్తు 6వేల 993 మీటర్లే. ఎవరైస్టుపైకి ఎంట్రీ ఉంది కానీ దీనిపైకి మాత్రం మానవమాత్రుల ప్రవేశం నిషేధం. ఎవరెస్ట్ పర్వతారోహణలో ఏటా పదుల సంఖ్యలో సాహసికులు మృత్యువాత పడుతుంటారు. అయినా సాహసికులను నేపాల్ ప్రభుత్వం ఆపదు. టూరిజం ప్రధాన వనరుగా ఉన్న ఆ దేశాన్ని ఎవరెస్ట్ పోషిస్తుంది. మరి అలాంటి చోట ఎవరెస్టు కంటే తక్కువ ఎత్తున్న మచ్చాపుచ్చారే పైకి అధిరోహకులను అనుమతించకపోవడమే ఆసక్తిని రేపుతోంది. అలాగని దీన్ని అధిరోహించడం కష్టమే కాదు.. ఎవరెస్ట్ ను ఎక్కినంత ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ప్రాణాలకు తెగించి ఎత్తైన పర్వత శిఖరాలను ముద్దాడే సాహసికులకు దీన్ని అధిరోహించడం పెద్ద లెక్కే కాదు. కానీ వారికి మాత్రం ఆ అవకాశం లేదు.

బయటి ప్రపంచానికి, సాహసికులకు ఇది కేవలం ఓ పర్వతం… అందమైన హిమశిఖరం.. కానీ స్థానికులకు మాత్రం ఇది వందల్లో ఉన్న పర్వతాల్లో ఒకటి కాదు… అత్యంత పవిత్రమైన ఒకే ఒక పర్వతం… సర్వ జగత్తునూ నడిపించే లయకారుడు, భక్త సులభుడు మహాశివుడి నివాసం అది అని స్థానికుల గట్టి నమ్మకం. ఈ పర్వతంపై ఆ భోళాశంకరుడు ఉంటాడని స్థానిక తెగలు విశ్వసిస్తారు. విశ్వాసం అంటే అలా ఇలా కాదు ఎవరైనా దీనిపై అడుగు పెట్టాలని చూస్తే మాత్రం ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడనంత భక్తి….

కైలాస సరోవర్, అమర్ నాథ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ పర్వతం పేరు అంతగా ప్రపంచానికి తెలియలేదు. ఈ పర్వతం చూడటానికి అందంగా కనిపిస్తుంది. కానీ స్థానికులు మాత్రం ఈ పర్వతం చుట్టూ ఓ రకమైన ఆరా కనిపిస్తుంది అంటారు. కైలాస పర్వతం, అమర్ నాథ్ లో మహాశివుడు ఉంటాడని ఎలా నమ్ముతామో స్థానికులు ఆ పర్వతంపై ఆ దేవదేవుడు ఉన్నట్లు నమ్ముతారు. శ్వేతవర్ణంలో ధగధగయామానంగా వెలుగులీనే ఈ పర్వతం మరో కైలాసం అని పూజలు చేస్తారు. ఈ పర్వతంపైకి ఎవరైనా ఎక్కేందుకు ప్రయత్నిస్తే వారికి కఠిన శిక్షలు విధిస్తుంది నేపాల్ ప్రభుత్వం. స్థానికులు కూడా తమ కన్ను కప్పి ఎవరూ ఈ పర్వతంపైకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు.