Mystery Machapuchare : కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణం అదేనా..?

కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణాలేంటో తెలుసుకోవాలని పర్వతారోహకుల ఆకాంక్ష.

Mystery Machapuchare : కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణం అదేనా..?

Mystery Of Machhapuchhare Mountain

Updated On : October 31, 2022 / 12:45 PM IST

Mystery Machapuchare :  హిమాలయా పర్వతాల్లో ఇమిడిపోయి ఉండే ఆ పర్వతాన్ని చూస్తే కళ్లు తిప్పుకోలేం. అందం..దర్పం..ఆ పర్వతం సొంతం. ఎన్నో సాహసాలు చేసే పర్వతారోహకులు కూడా అడుగుపెట్టటని అత్యంత రహస్యం కూడా ఆ పర్వతం సొంతమే. దూరం నుంచి చూస్త..మనిషుల సాహసాలను.. లివితేటల్ని సవాల్ చేసేలా ఉండే ఆ పర్వతం దగ్గరకెళ్లి అడుగుపెట్టడానికి కూడా ఎంత సాహసవంతులకైనా బెరుకుపుట్టాల్సినంటుంది. అటువంటి ఆ పర్వతం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలని మనిషి ఆరాటపడుతున్నారు. కానీ ఆ రహస్యాలను తెలుసుకోవటానికి కూడా ఆ పర్వతం కొలువైన నేపాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఆ రహస్య పర్వతమే నేపాల్ దేశంలో ఉన్న ‘మచ్చాపిచ్చారే’..ప్రపంచంలోనే అత్యంత ఎతైన పర్వతం అయిన ఎవరెస్ట్ ఎక్కటానికి కూడా అనుమతి ఇచ్చే నేపాల్ ప్రభుత్వం ఈ రహస్య పర్వతం అధిరోహణకు అనుమతి ఇవ్వదు. ఎందుకు అనుమతి ఇవ్వదు అనే దానికి సరైన సమాధానం నేపాల్ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ పర్వతారోహణకు మాత్రం వీల్లేదు. అంతే… మనిషి అడుగుపెట్టని పర్వతం ఇదొక్కటేనేమో…

ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తు..అయినా ఎవ్వరూ కాలు మోపని రహస్య పర్వతం
ఎత్తేమో తక్కువ… కింద నుంచి చూస్తుంటే చాలా అందంగా దర్శనమిస్తుంది. మరి అలాంటి పర్వతాన్ని అధిరోహించడానికి సాహసికులు ఎంతో ఉవ్విళ్లూరుతారు. కానీ ఇప్పటిదాకా ఎవరికీ ఆ అదృష్టం దక్కకపోవడం విశేషం. దొంగతనంగా అందరి కళ్లుగప్పి పైకి ఎక్కడానికి ప్రయత్నించిన వారు అనూహ్య పరిస్థితుల్ని ఎదుర్కొని బతుకుజీవుడా అంటూ ప్రాణం కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది…ఈ పర్వతాన్ని దూరం నుంచి చూడగానే పర్వాతరోహకులు దాంతో ప్రేమలో పడిపోతారు. అంత అందంగా కనిపిస్తుంది. కాస్త దగ్గరగా వెళ్లి దాని సౌందర్యాన్ని చూస్తే ఎలా వర్ణించాలో మాటలు కూడా రావు. అందుకే ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించి మురిసిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ దాన్ని బేస్ క్యాంప్ నుంచి కళ్లతో చూసి ఆస్వాదించాలే కానీ ధైర్యం చేసి కాలు ముందుకు కదిపే వీలులేదు…

Mystery Mountain : మానవుడు ఇప్పటి వరకు అడుగు పెట్టని పర్వతం..! అందంగా కనిపించే ఈ పర్వతం వెనుకున్న రహస్యమేంటీ..?!!

మచ్చాపుచ్చారేను అధిరోహించడానికి యత్నించిన..బ్రిటీష్ సైనికాధికారి కానీ..
మచ్చాపుచ్చారేను అధిరోహించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు లెఫ్టెనెంట్ కల్నల్ జేమ్స్ ఓవెన్ మెరియన్ రాబర్ట్స్…అలియాస్ జిమ్మీ రాబర్ట్స్… ఓ బ్రిటీష్ సైనికాధికారి. 1956లో ఆయన నేపాల్ కు తొలి మిలటరీ అటాచీగా నియమితులయ్యారు. ఆయన సమయంలోనే నేపాల్ ప్రపంచ ట్రెక్కింగ్ కేంద్రంగా మారిపోయింది. నేపాలీలకు పర్యాటకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూపించింది ఆయనే… మారుమూల ప్రాంతాల్లోని పర్వతాల అధిరోహణను వాణిజ్యపరంగా మార్చడానికి చాలా ప్రయత్నించారు. ఇప్పటికీ నేపాలీయులు ఆయన్ను ఫాదర్ ఆఫ్ ట్రెక్కింగ్ గా చెప్పుకుంటారు. మచ్చాపుచ్చారి గురించి ఓ సైనికాధికారి ఆయనకు లేఖ రాయడంతో దాన్ని అధిరోహించాలని జిమ్మి తహతహలాడిపోయారు. ఆ సమయానికి నేపాల్ లో పర్వతారోహణకు ఎన్నో అడ్డంకులు… చివరికి 1957లో మచ్చపుచ్చారిని అధిరోహించటానికి జిమ్మీ రెడీ అయ్యారు. విల్ఫ్రెడ్ నోయిస్ అనే సారథి నేతృత్వంలో అంతా బయలుదేరారు. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే మచ్చాపుచ్చారి ఎందుకవుతుంది. సగం దూరం వెళ్లేసరికి ఇద్దరు మాత్రమే మిగిలారు. జిమ్మీ కూడా వెనుతిరగాల్సి వచ్చింది. మిగిలిన ఇద్దరూ కూడా పర్వత శిఖరం మరో 45 మీటర్ల దూరం ఉందనగా మంచు తుపాను బారిన పడ్డారు. ఎలాగోలా పైకి వెళ్దామని ప్రయత్నించే కొద్దీ ఆటంకాలు పెరిగాయే కానీ తగ్గలేదు. దీంతో వారు శిఖరాన్ని ముద్దాడకుండానే వెను తిరగాల్సి వచ్చింది.

ఓ బ్రిటీషర్ మాటలకు నేపాల్ ఎందుకంత విలువ ఇచ్చింది…?
నిజానికి వారు పర్వారోహణకు వెళ్లిన సమయం మంచి వేసవి. ఆ సమయంలో మంచు తుపానులకు అవకాశం లేదు. కానీ అంత హఠాత్తుగా ఊహించని స్థాయిలో హిమపాతం ఎక్కడ్నుంచి వచ్చిందన్నది మిస్టరీనే…. దేవుడే వారి రాకను గ్రహించి హెచ్చరించి వెనక్కు పంపాడన్నది స్థానికుల నమ్మకం… ఆ పర్వతంపై ఏం జరిగిందో జిమ్మీ టీమ్ ఎవరికీ చెప్పలేదు. అంతేకాదు నేపాల్ ప్రభుత్వాన్ని ఓ అసాధారణ కోరిక కోరాడు. మచ్చాపుచ్చారిని ఎవరూ అధిరోహించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఏం చెప్పారో ఏం చూపించారో కానీ నేపాల్ ప్రభుత్వం వెంటనే అందుకు అంగీకరించింది. అప్పట్నుంచి మచ్చాపుచ్చారో అధిరోహణ ఎవరికీ అందని ద్రాక్షే..

మచ్చాపుచ్చారే రహస్యాన్యని చెప్పటానికి ఇష్టపడని బ్రిటీష్ అధికారి..
మచ్చాపుచ్చారేపై ఆయన దేవుడ్ని చూశారని కొందరు చెప్పుకుంటారు. ఏం జరిగిందని ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఆయన నోరువిప్పలేదు. మిగిలిన వారు కూడా మౌనం వహించారు. దీంతో పైన ఏదో జరిగిందని అందరూ అనుమానించారు. మరో కథనం ప్రకారం పొఖారా, ఆ పరిసరాల్లో నివసించే గూర్ఖా జాతి ప్రజలైన గురుంగ్‌లతో జిమ్మీకి చాలా సన్నిహితమైన సంబంధబాంధవ్యాలు ఉండేవి. మచ్చపుచ్చారి వారికి పవిత్రమైన పర్వతం కావడంతో ఆయన కావాలనే దానిపైకి పర్వతారోహణను నిషేధించేలా చేశారని చెప్పుకుంటారు. కానీ నేపాల్ హిమాలయాల్లోని పలు పర్వతాలు పలు జాతుల వారికి చాలా పవిత్రమైనవి. అయినా ఆ కారణంగా ఆయా పర్వతాలను అధిరోహించటానికి నేపాల్ సర్కారు అనుమతులు ఆపలేదు. జిమ్మీ కూడా ఆ పర్వతాలు ఎక్కకుండా ఉండలేదు. అలాంటప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని ఆయన ఎలా ఒప్పించగలిగారనేది అతిపెద్ద మిస్టరీనే..

అక్కడినుంచి అడుగు ముందుకేయకూడదు..వేస్తే
అయితే.. మచ్చపుచ్చారికి వెళ్లడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుండడం.. అక్కడి ప్రకృతి అందాలను చూడాలనుకోవడంతో.. నేపాల్‌ ప్రభుత్వం.. ఓ బేస్‌క్యాప్‌ను 2012లో ఏర్పాటు చేసింది. మచ్చపుచ్చారికి దిగువన గల మార్డీ హిమల్ అనే చిన్న పర్వతం దగ్గర ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే.. అక్కడి వరకూ వెళ్లొచ్చు. ఇది 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి ఐదు రోజుల పాటు 40 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అక్కడి నుంచి మచ్చపుచ్చారిని అతి సమీపంగా చూడొచ్చు. అంతవరకే అది దాటి ముందుకు అడుగు వేయడానికి వీల్లేదు.

పైకి వస్తే ప్రాణాలు పోతాయని పరమశివుడు శాసనమా? 
ఇంత చెబుతున్న ఈ మచ్చాపుచ్చారేపైకి ఎవరూ అడుగుపెట్టలేదా అంటే స్థానికంగా వినిపించేది మాత్రం లేదనే … ఒక్కడు ఒకే ఒక్కడు దాదాపు చివరి వరకూ వెళ్లాడు. ఏం చూసాడో కానీ తిరిగి రాగలిగాడు. అతడిని శివయ్య క్షమించి వదిలేసినట్లు చెబుతారు. ఎవర్నీ పైకి రానివ్వొద్దని వస్తే ప్రాణాలతో తిరిగిపోరని ఏవో అదృశ్యశక్తులు అతడ్ని హెచ్చరించాయంటారు. ఆ తర్వాత అతను ట్రెక్కింగ్ ను వదిలేశాడట. అతడి దారిలోనే నడవాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరూ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. అలాగే ఎవరూ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి మృత్యువాత పడకపోవడం మిస్టరీనే. మంచు తుపానులు బెదిరించి భయపెట్టాయే తప్ప ఎవరి ప్రాణాలు తీయకపోవడం విశేషమే…