Vehicle Crash in US : ఆరు వాహనాలు ఢీ..తొమ్మిది మంది మృతి

అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Nine Died In Six Vehicle Crash In Nevada (1)

Six Vehicle Crash in US Nevada : అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అమెరికాలో నెవాడా రాష్ట్రం లాస్​ వెగాస్​లో ఆరు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : America: అమెరికాలో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చిక్కుకున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టడమే ఈ ఘటనకు కారణమని నార్త్​ లాస్​ వెగాస్​ పోలీసు అధికారి అలెగ్జాండర్ క్యూవాస్​ తెలిపారు. మరణించినవారంతా యుక్త వయస్సువారేనని తెలిపారు.