Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ గతకొద్ది రోజులుగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే రానుందంటూ చిత్ర యూనిట్ ఈ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేస్తూ వస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాలో హీరో నితిన్ ‘సిద్ధార్థ్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఐఏఎస్ పాత్రలో మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ డ్రామాకు పొలిటికల్ అంశాలను జోడించి ఈ సినిమాను దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
Nithiin: మాచర్ల నియోజకవర్గం సాలిడ్ అప్డేట్ ఇదే!
సిద్ధర్థ్ రెడ్డి పాత్రలో నితిన్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ లుక్‌తో నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దీనికి అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. నితిన్‌ను ఇంతకు ముందర ఇలాంటి లుక్ లో చూడలేదని.. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని వారు అప్పుడే అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని పొలిటికల్ అంశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’లో మార్చి 24న కొత్త ఆర్డర్!
నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాస్ట్రో’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో అభిమానులు ఆయన సినిమాను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నితిన్ ఈ సినిమాలో చేసే మాస్ ఫైట్లు, ప్రేక్షకులను కట్టిపడేస్తాయని వారు అంటున్నారు. కాగా ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ త్రేసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అదనపు బలంగా మారనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Its time to take my First Charge ✍️
Reporting as SIDDHARTH REDDY ?
Meeku Nachhe , Meeru Mechhe
MASS tho Vastunaa :)))
#MacherlaNiyojakavargam?@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic pic.twitter.com/7vaf5h9YjK— nithiin (@actor_nithiin) March 26, 2022