Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’లో మార్చి 24న కొత్త ఆర్డర్!

యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది ‘మాస్ట్రో’ అనే సినిమాలో నటించిన నితిన్....

Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’లో మార్చి 24న కొత్త ఆర్డర్!

New Update On Nithiin Macherla Niyojakavargam Movie

Nithiin: యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది ‘మాస్ట్రో’ అనే సినిమాలో నటించిన నితిన్, ఆ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. హిందీలో తెరకెక్కిన ‘అందాధున్’ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకుంది. టైటిల్ తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

ఇక ఈ సినిమాను ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి మార్చి 24న ఉదయం 10.08 గంటలకు ఒక అప్ డేట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ అప్ డేట్ విషయాన్ని అనౌన్స్ చేశారు.

కాగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ త్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి రాబోతున్న అప్ డేట్ ఏమిటనేది తెలియాలంటే మార్చి 24 ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడట. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.