Dharmendra Pradhan
Dharmendra Pradhan: బిహార్‌లోని ఎన్డీఏలో ఎలాంటి విభేదాలూలేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే 2025 వరకు కొనసాగుతారని చెప్పారు. బీజేపీకి, నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన మహిళను తాము రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పారు. ఆమె నామినేషన్ వేస్తోన్న సమయంలో ఎన్డీఏ నేతలందరూ మద్దతు తెలిపారని అన్నారు.
Maharashtra: నడ్డాతో ఫడ్నవీస్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
మద్దతు కోరుతూ ఆమె త్వరలోనే బిహార్‌కు కూడా వెళ్ళనున్నారని చెప్పారు. ఎన్డీఏలో ఎటువంటి అసమ్మతీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పే హక్కు రాజకీయాల పార్టీలకు ఉంటుందని చెప్పారు. నితీశ్ కుమార్ బిహార్‌కు చెందిన ఎన్డీఏ నేత అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తదుపరి ఎన్నికల వరకు బిహార్ సీఎంగా ఎవరు ఉంటారన్న విషయంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని, నితీశ్ కుమారే ఉంటారని ఆయన చెప్పారు.