Maharashtra: న‌డ్డాతో ఫ‌డ్న‌వీస్ భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌

మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.

Maharashtra: న‌డ్డాతో ఫ‌డ్న‌వీస్ భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌
ad

Maharashtra: మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ఆయ‌న క‌లిశారు. వారిద్ద‌రి మ‌ధ్య దాదాపు 30 నిమిషాల పాటు చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటుపై వారు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న‌ అవ‌కాశం గురించి న‌డ్డాకు ఫడ్నవీస్ వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Maharashtra: రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ లేఖ‌
ఢిల్లీలో అమిత్ షాను కూడా ఫడ్నవీస్ క‌ల‌వ‌నున్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు వెళ్ళాల‌ని బీజేపీ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి అసోంలోని గువాహ‌టిలోని హోట‌ల్ నుంచి ఏక్‌నాథ్ షిండే రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ముంబైకి వెళ్ళ‌నున్న నేప‌థ్యంలో ఇదే స‌మ‌యంలో ఫ‌డ్న‌వీస్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.