Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
అసోంలోని గువాహటిలో హోటల్‌లో ఉంటోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు. వెంటనే మహారాష్ట్రకు వచ్చేయాలని, చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన చెప్పారు.

Uddav
Maharashtra: అసోంలోని గువాహటిలో హోటల్‌లో ఉంటోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు. వెంటనే మహారాష్ట్రకు వచ్చేయాలని, చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన చెప్పారు. ”మీలో చాలా మంది మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీరు శివసేనకు చెందిన వారు. చర్చించుకుందాం రండి.. సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొందాం” అని లేఖలో ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్‌నాథ్ షిండే
”నేను మీకో విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇప్పటికీ సమయం మించిపోలేదు. దయచేసి వచ్చేయండి. నాతో కలిసి కూర్చొని మాట్లాడండి. శివసైనికుల, ప్రజల మనసులో ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయండి. శివసేన పార్టీలో మీకు దక్కిన గౌరవం మరే ఇతర పార్టీలోనూ దక్కదు. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా నేను మీ గురించి చింతిస్తున్నాను. ఎవరి ఉచ్చులోనూ మీరు పడొద్దు” అని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. కాగా, ఏక్‌నాథ్ షిండే తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేడు ఆయన ముంబైకి వెళ్ళే అవకాశం ఉంది.