KS Eshwarappa: కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రికి క్లీన్‌చిట్

గత ఏప్రిల్ 12న కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.

Ks Eshwarappa

KS Eshwarappa: కర్ణాటకలో సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో బీజేపీకి చెందిన మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ ఘటనలో ఈశ్వరప్పకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రకటించారు. గత ఏప్రిల్ 12న సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Taj Mahal: అత్యధిక ఆదాయం సంపాదించిన కట్టడంగా తాజ్‌ మహల్

తన ఆత్మహత్యకు అప్పటి కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఈశ్వరప్పనే కారణమని, ఆత్మహత్యకు ముందు సంతోష్ ఒక వాట్సాప్ మెసేజ్‌ను తన సన్నిహితులకు పంపాడు. పలు రాజకీయ నాయకులు, సంతోష్ స్నేహితులకు ఈ మెసేజ్ చేరింది. దీంతో సంతోష్ ఆత్మహత్యపై వివాదం మొదలైంది. దీనికి బాధ్యుడైన మంత్రిని పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. చివరకు హై కమాండ్ సూచన మేరకు ఈశ్వరప్ప పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత సంతోష్ ఆత్మహత్యపై కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగా ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదుకాగా, పోలీసులు విచారణ జరిపారు. ఈ ఘటనలో ఈశ్వరప్పకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఈ కారణంగా ఆయనకు సంబంధం లేదని తేల్చారు పోలీసులు.

Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్‌పై సబ్సిడీ పునరుద్ధరణకు నో

సంతోష్ పాటిల్ ఒక కాంట్రాక్టర్. కొంతకాలం క్రితం రూ.4 కోట్లతో ఒక ప్రాజెక్టు చేపట్టాడు. అయితే, ప్రాజెక్టు పూర్తైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఆయనకు బిల్లులు రాలేదు. ఈ విషయంలో మంత్రిగా ఉన్న ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడిగారని, 18 నెలలుగా బిల్లుల కోసం వేధిస్తున్నాడని సంతోష్ ఆరోపించాడు. తన భార్య నగలు అమ్మి పనులు పూర్తి చేసినప్పటికీ, బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని సంతోష్ చెప్పాడు. అయితే, గతంలో కూడా ఈశ్వరప్పపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.