Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్‌పై సబ్సిడీ పునరుద్ధరణకు నో

సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.

Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్‌పై సబ్సిడీ పునరుద్ధరణకు నో

Senior Citizens

Senior Citizens: సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. రైల్వే టిక్కెట్‌ ధరలపై వృద్ధులకు ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. ఇకపై వృద్ధులకు రైల్వేలో ఎలాంటి రాయితీ ఉండబోదని ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రైల్వే శాఖ అందించే అన్ని రాయితీలను రద్దు చేసింది కేంద్రం.

Piyush Goyal: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: కేంద్ర మంత్రి పియూష్ గోయల్

మార్చి 2020 నుంచి ఈ రాయితీ రద్దైంది. అయితే, వాటిలో కొన్నింటిని మాత్రమే తిరిగి పునరుద్ధరించింది. ప్రస్తుతం ఎంపీలు, మాజీ ఎంపీలకు రాయితీ అందుతోంది. కానీ, వృద్ధులకు మాత్రం రాయితీని కొనసాగించలేమని చెప్పింది. రైల్వే టిక్కెట్ ధరలు తక్కువగానే ఉన్నాయని కేంద్రం తెలిపింది. ‘‘కోవిడ్ కారణంగా రైల్వేకు వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. ఇది రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాయితీలు కొనసాగిస్తే, రైల్వే శాఖ మరింత నష్టపోతుంది. అందువల్ల సీనియర్ సిటిజన్స్‌కు రాయితీ ఇవ్వడం సాధ్యం కాదు’’ అని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర నివేదిక ప్రకారం 2019-20 మధ్య కాలంలో 22.62 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ రాయితీని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రైల్వే శాఖ గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజాస్, హమ్ సఫర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ ప్యాసింజర్ వంటి రైలు సర్వీసుల్ని నడుపుతోంది.

Taj Mahal: అత్యధిక ఆదాయం సంపాదించిన కట్టడంగా తాజ్‌ మహల్

ప్రతి రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ రిజర్వ్‌డ్ వంటి కేటగిరీలున్నాయి. వివిధ కేటగిరీల కింద వృద్ధులకు ఇచ్చే రాయితీ వల్ల రైల్వే శాఖ రూ.4,794 కోట్ల ఆదాయం కోల్పోయిందని కేంద్రం తెలిపింది. రైల్వేలో 50 సంవత్సరాలు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ అందిస్తుండగా, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు 40 శాతం రాయితీని రైల్వే శాఖ అందించేది. రెండేళ్లుగా ఈ రాయితీ లేకపోవడంతో రైల్వే శాఖకు అదనంగా రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరినట్లు అంచనా.