Piyush Goyal: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: కేంద్ర మంత్రి పియూష్ గోయల్

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Piyush Goyal: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: కేంద్ర మంత్రి పియూష్ గోయల్

Piyush Goyal

Piyush Goyal: తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేశామని చెప్పారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. తెలంగాణలో ధాన్యం సేకరణ నిలిపివేయడంపై కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై స్పష్టతనిచ్చారు.

Taj Mahal: అత్యధిక ఆదాయం సంపాదించిన కట్టడంగా తాజ్‌ మహల్

‘‘అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. అందుకే తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేశాం. తెలంగాణ ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణం. తెలంగాణలో 40 మిల్లుల్లో బియ్యం సంచులు కూడా మాయమయ్యాయి. మొత్తం 4,53,896 బియ్యం సంచులు మాయమయ్యాయి. మిల్లులపై చర్యలు తీసుకోమని చెబితే తీసుకోవట్లేదు. ఇంత ఘోరం ఏ ప్రభుత్వమూ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే రైతులకూ లాభం రాదు. ప్రజలకూ లాభం రాదు. మిల్లుల్లో ధాన్యం లెక్కలు సరిపోవడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం విఫలమైంది. ప్రధాని గరీబ్ యోజన అమలు చేయని ఏ రాష్ట్రంలోనూ ఎఫ్‌సీఐ బియ్యం సేకరించదు. కేంద్రం చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో త్వరలో ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణ మొదలుపెడుతుంది.

Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు, సిద్ధూ మూసేవాలా హంతకులకు మధ్య కాల్పులు

బియ్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లకు ఎఫ్‌సీఐ అనుమతిచ్చింది. కేంద్రం ఒత్తిడి తీసుకురావడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ధాన్యాన్ని పంపిణీ చేస్తోంది. అన్నయోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన 5 కిలోల బియ్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. రాష్ట్రం తీరువల్లే పేదలకు బియ్యం అందడంలేదు. ప్రజా సంక్షేమంకంటే రాజకీయాలపైనే తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రధాని, కేంద్ర మంత్రుల గురించి చవకబారు విమర్శలు చేశారు. దుర్భాషతో మోదీని కించపరిచే పనిలో ఉన్నారు’’ అని పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.