Raj Thackeray
Mumbai: మరాఠీ పాటలను ప్లే చేయలేదని ముంబై సమీపంలోని వాషిలోని ఓ హోటల్ సిబ్బందిని రాజ్ థాకరేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు కొట్టారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Aaditya Thackeray: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే.. రాహుల్కు ఆత్మీయ ఆలింగనం
మరాఠీ పాటల విషయంలో కొంతమందికి, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంఎన్ఎస్ కార్యకర్తలు కూడా చేరారు. అయితే హోటల్ సిబ్బంది, మేనేజర్ పరిస్థితిని వారికి వివరించడానికి ప్రయత్నించారు. కానీ వివాదం కాస్త కొట్టుకొనేవరకు చేరింది. ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించిన కొందరు వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.