Aaditya Thackeray: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే.. రాహుల్‭కు ఆత్మీయ ఆలింగనం

థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు కొనసాగుతోంది.

Aaditya Thackeray: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే.. రాహుల్‭కు ఆత్మీయ ఆలింగనం

Aaditya Thackeray On Joining Bharat Jodo Yatra

Aaditya Thackeray: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో శివసేన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే పాల్గొన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని హింగోలి సమీపంలో కలంనురిలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు థాకరే. కొద్ది దూరం రాహుల్‭తో పాటు కలిసి నడిశారు. ఈ క్రమంలో ఆయనతో థాకరే కొంత ముచ్చటించారు. అనంతరం మీడియాతో ఆదిత్య థాకరే మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర రాజకీయాల కంటే ఎక్కువని, ఇది దేశం యొక్క ఆలోచనని అన్నారు.

‘‘ఇది (భారత్ జోడో యాత్ర) ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఆలోచన కోసం సాగుతున్న యాత్ర. భారత ప్రజాస్వామ్యానికి ఈ యాత్ర అద్దం పడుతోంది’’ అని ఆదిత్య థాకరే అన్నారు. థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు కొనసాగుతోంది.

వాస్తవానికి ఈ యాత్రలో సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆసుపత్రిలో చేరారని, అందుకే హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం స్పష్టం చేశారు. ఈ యాత్రకు ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, సుప్రియా సూలే, జితేంద్ర అహ్వాద్ శుక్రవారం హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు.

Idgah Maidan: అసదుద్దీన్ మీటింగ్ అయిపోగానే గోమూత్రంతో వెళ్లి ఈద్గా మైదానాన్ని శుభ్రం చేసిన శ్రీరాం సేన