Sidhu Moose Wala: ఎన్నికల్లో పోటీపై సిద్ధూ తండ్రి స్పష్టత

తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్‌కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.

Sidhu Moose Wala

Sidhu Moose Wala: తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్‌కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. శనివారం ఉదయం బాల్‌కౌర్ సింగ్‌ను చండీఘడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసిన సంగతి తెలిసిందే.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

ఈ సందర్భంగా తన కొడుకు హత్యపై విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని బాల్‌కౌర్ సింగ్ కోరారు. ఆయన అమిత్ షాను కలవడంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బాల్‌కౌర్ సింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సంగూర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై బాల్‌కౌర్ సింగ్ స్పందించారు. తన కొడుకు సిద్ధూ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక వీడియో ద్వారా స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. సంగూర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ ప్రస్తుత సీఎం భగవంత్ మన్ సింగ్ ఎంపీగా ఉండేవారు.

Janasena Nagababu : పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

పంజాబ్‌లో ఆప్ గెలవడంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచి సీఎం అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేసిన లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. దీనికి ఈ నెల 23న ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికలోనే బాల్‌కౌర్ సింగ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.