Olivia Morris: అమ్మా.. ఒలివియా.. ఒక్కసారి వచ్చిపోమ్మా..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనంలోకి....

Ntr Funny Comments About Olivia Morris

Olivia Morris: టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా RRR యూనిట్ వరుసబెట్టి పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే వీటన్నింటితో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం RRR గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుని, వాటిని ప్రేక్షకులకు అందించేందుకు వారే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వీరిలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్‌ను తనదైన ప్రశ్నలతో దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ఈ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి RRR సినిమాకు సంబంధించి అన్ని రకాల ప్రశ్నలను చిత్ర యూనిట్‌ను అడిగాడు. ఈ క్రమంలోనే హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు తారక్ కూడా తనదైన రీతిలో సమాధానం చెప్పడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. RRR లాంటి ప్రెస్టీజియస్ మూవీలో తారక్ నటిస్తున్నాడంటే, ఖచ్చితంగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆయన పాత్రతో పాటు ఆయనకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా అంచనాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాలో తారక్ సరసన అసలు హీరోయిన్ ఉందా అంటూ అనిల్ రావిపూడి ప్రశ్నించాడు.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

దీంతో తారక్ చెప్పిన సమాధానం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ‘‘ఏమో ఈ సినిమాలో తనకు హీరోయిన్ ఉందో లేదో తెలియదని.. తనకు కూడా ఈ విషయం అర్థం కాలేదని’’ తారక్ అన్నాడు. ‘‘ఉండీ ఉండనట్టుగా.. నాదా కాదా అన్నట్టుగా.. అది ఉందా లేదా అన్నట్టుగా.. ఆయన ఎవరినైనా పెట్టారా లేదా అన్నట్టుగా.. విచిత్రంగా ఉంది’’ అంటూ తారక్ సరదా రిప్లై ఇచ్చాడు. అయితే వెంటనే అనిల్ రావిపూడి ‘‘అవును.. ఎక్కడో వైట్ షాట్‌లో దూరంగా జూమ్ కొడితే అలా వచ్చి వెళ్లిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి తారక్ కూడా ‘‘అమ్మా.. మెరుపుతీగ.. ఓసారి వచ్చి వెళ్లిపోమ్మా’’లాగా తన పక్కన హీరోయిన్ ఉందని కామెడీ చేశాడు తారక్.

NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తారక్ తన పక్కన నటించిన హీరోయిన్ విషయంలో ఇంత కామెడీ చేయడంతో ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర టీజర్స్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తుండగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని డివివి.దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.