NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే 'ఆర్ఆర్ఆర్' చేయను అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''ఆర్‌ఆర్‌ఆర్‌ కు రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్‌.......

NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

Rrr Ntr

Rajamouli :  రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మాణంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సత్యరాజ్ లతో పాటు హాలీవుడ్, వివిధ భాషల స్టార్స్ కూడా నటించారు. కరోనా కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

తాజాగా మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. తెలుగు, హిందీతో పాటు వివిధ భాషల్లో మరోసారి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను అని అన్నారు.

Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే…

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”ఆర్‌ఆర్‌ఆర్‌ కు రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్‌ దర్శకత్వం చేసి ఉంటే నేను నటించేవాడిని కాదు. ఇలాంటి కథ రాజమౌళికే సొంతం. ఏ దర్శకుడు కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి కథను రాసే సాహసం చేయరు. నేనైతే జక్కన్న కోసమే ఈ సినిమా చేశాను” అని తెలిపారు. ఇక రామ్ చరణ్ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి వేరే దర్శకుడు అని ఆలోచించడం కూడా కష్టమే అన్నారు. దీని బట్టి ఇద్దరికీ రాజమౌళి మీద ఎంత నమ్మకం ఉందో తెలిసిపోతుంది. వీరిద్దరూ రాజమౌళిని మాత్రమే నమ్మి ఈ సినిమా కోసం ఇంత టైం కేటాయించి కష్టపడ్డట్టు అర్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి గతంలో రాజమౌళి భారీ హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.