Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే…

తాజాగా మరోసారి 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు జక్కన్న అండ్ టీం. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసారు రాజమౌళి. ఇందులో........

Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే…

Rrrteam

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ లతో పాటు వివిధ భాషల స్టార్స్ కూడా నటించారు. కరోనా కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు జక్కన్న అండ్ టీం. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసారు రాజమౌళి. ఇందులో భాగంగా తారక్‌ని కొమరం భీంగా, చెర్రీని అల్లూరిగా ఎందుకు తీసుకున్నాడో వివరించారు రాజమౌళి.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

రాజమౌళి మాట్లాడుతూ.. ”నేను వయసును దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్‌ని కొమురం భీంగా, రామ్‌‍చరణ్‌ని అల్లూరి సీతారామరాజుగా తీసుకోలేదు. అల్లూరి క్యారెక్టర్ ఎంత అగ్నినైనా గుండెల్లో పెట్టుకొనే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఎలాంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అదరకుండా, బెదరకుండా స్థిరంగా ఉంటాడు. అది చరణ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర చరణ్‌కి ఇచ్చా. ఇక కొమరం భీం పాత్ర ఎంతో అమాయకమైన వ్యక్తిది. పీలింగ్స్‌ని దాచుకోలేడు. అది తారక్‌లో కనిపిస్తుంది. అందుకే తారక్‌కు కొమరం భీం పాత్ర ఇచ్చా” అని తెలిపారు.