RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

'ఆర్ఆర్ఆర్' సినిమా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలని రిఫరెన్స్ గా తీసుకొని తెరకెక్కించారు. ముందు నుంచే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా కల్పితకథ అని, కేవలం ఆ క్యారెక్టర్స్ ని......

RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

Rrr

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. డి.వి.వి. దానయ్య నిర్మాణంలో రూపొందించబడిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలని రిఫరెన్స్ గా తీసుకొని తెరకెక్కించారు. ముందు నుంచే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా కల్పితకథ అని, కేవలం ఆ క్యారెక్టర్స్ ని మాత్రమే రిఫర్ తీసుకొని చేశామని చెప్తూనే ఉన్నారు. అయితే ఇటీవల అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని, అల్లూరి సీతారామరాజు చరిత్రని తప్పుగా చూపించారని అల్లూరి వంశస్థురాలైన అల్లూరి సౌమ్య అనే మహిళ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపాలని కోరింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ‘భీమ్లానాయక్’ నిర్మాతల చేతుల్లో..

అయితే ఈ కేసు విచారణలోకి రాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దర్శక నిర్మాతలకి ఊరట లభించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అల్లూరి సౌమ్య దాఖలు చేసిన పిల్ ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి, కొమరం భీంలను దేశభక్తులుగానే చూపించామని, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కేవలం కల్పిత కథే అని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’కు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలన్న పిల్ ని కొట్టేసిన హైకోర్టు ఈ సినిమాతో అల్లూరి, కొమరం భీంల పేరు, ప్రఖ్యాతులకు భంగం కలగదని తెలిపింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.