RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ‘భీమ్లానాయక్’ నిర్మాతల చేతుల్లో..

'ఆర్ఆర్ఆర్' భారీ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ కి కూడా భారీ పోటీ ఉందట. ఇప్పటికే చాలా చోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ధరకి జరిగిపోయింది. వేరే రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్ ఇప్పటికే......

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ‘భీమ్లానాయక్’ నిర్మాతల చేతుల్లో..

Sithara

RRR : రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. చాలా కాలంగా ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతటి భారీ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ కి కూడా భారీ పోటీ ఉందట. ఇప్పటికే చాలా చోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ధరకి జరిగిపోయింది. వేరే రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్ ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా చాలా మంది పోటీ పడ్డారు. ఇక ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ కోసం పోటీ పడ్డారు.

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో, వరుస విజయాలతో బిజీగా ఉంది. ఇటీవలే ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’ సినిమాలతో బ్యాక్ టు వ్యక్ హిట్స్ సాధించారు. సితార ఎంటర్టైన్మెంట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఆస్ట్రేలియా రైట్స్ ని సాధించుకుంది. ఆస్ట్రేలియా ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకొని సినిమాని అక్కడ రిలీజ్ చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్ట్రేలియా రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా 6.5 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఒక తెలుగు సినిమాకి ఆస్ట్రేలియా రైట్స్ కి ఈ అమౌంట్ అంటే చాలా ఎక్కువే.

RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

అయితే తెలుగు వారితో పాటు ఇండియన్స్ అత్యధికంగా ఉండే ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవల ‘అఖండ’ సినిమా అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియాలో కచ్చితంగా ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని రాబడుతుందని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆశిస్తున్నారు.