Ntr Host Emk Show Auditions Start For Emk Next Waiting For Ntr
NTR host EMK Show: సైనింగ్ ఆఫ్ మీ రామారావు అంటూ బుల్లి రామయ్య మరోసారి బుల్లితెర మీదకి పయనమవుతున్న సంగతి తెలిసిందే. యాక్టింగ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు సంపాదించుకున్న తారక్ టెలివిజన్ మీద కూడా తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయగలడని బిగ్ బాస్ తొలి సీజన్ తో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న తారక్ ప్రేక్షకులను పలకరించి రెండేళ్లు అయింది. అందుకే మరోసారి టీవీ ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉండాలని ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ విచ్చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ షో టీజర్ తో తారక్ అందరి దృష్టిని ఆకర్షించగా తొలి ఎపిసోడ్ ఎప్పుడా అని ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గతంలో నాగార్జున, చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ హ్యాండిల్ చేసిన ఈ షోను యంగ్ స్టార్ తారక్ ఏ విధంగా రక్తికట్టిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూసే వారికి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అదే ఈఎంకే ఆఫ్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే అదృష్టవంతులు కోసం ఏపీలోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుండి ఆడిషన్స్ మొదలుపెట్టారట.
ముందుగా ఆడిషన్స్.. ఆ తర్వాత వారిలో ఫిల్టర్ చేసి కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తవగానే తారక్ హోస్టింగ్ తొలి ఎపిసోడ్ షూటింగ్ మొదలుపెట్టనున్నారట. ఒకవిధంగా ఆడిషన్స్ ప్రక్రియ మొదలైతే ఇక రామయ్య కోసమే వెయిటింగ్ అనమాట. మరి తొలి ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. తొలి ఎపిసోడ్ బుల్లి తెర మీద ఎప్పుడు ప్రసారమవుతుందోనని బుల్లి రామయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి మోస్ట్ అవైటెడ్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుందో!
Read: Vakeel Saab: వచ్చే నెలలో ఓటీటీలో విడుదల ప్రచారం.. నిజమేంటంటే?