Vakeel Saab: వచ్చే నెలలో ఓటీటీలో విడుదల ప్రచారం.. నిజమేంటంటే?

ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగినా వకీల్ సాబ్ మేనియా మాత్రం ఆగలేదు. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వసూళ్లలో కూడా వకీల్ సాబ్ సరికొత్త రికార్డులను నెలకొల్పినట్టుగా ట్రేడ్ పండితులు లెక్కలేశారు.

Vakeel Saab: వచ్చే నెలలో ఓటీటీలో విడుదల ప్రచారం.. నిజమేంటంటే?

Vakeel Saab

Vakeel Saab: ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగినా వకీల్ సాబ్ మేనియా మాత్రం ఆగలేదు. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వసూళ్లలో కూడా వకీల్ సాబ్ సరికొత్త రికార్డులను నెలకొల్పినట్టుగా ట్రేడ్ పండితులు లెక్కలేశారు. అయితే.. అనుకుంటుండగానే కరోనా ప్రభావం తీవ్రమై చివరికి కర్ఫ్యూల వరకు పరిస్థితి వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టమవగా కొన్నిచోట్ల అసలు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడంతో థియేటర్స్ మూతపడడ్డాయి.

దీంతో గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు రాబోయే కొత్త సినిమాల చూపు ఓటీటీల మీద పడింది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన భారీ సినిమాలు ఓటీటీలో ఎప్పుడొస్తాయా అనే చర్చ కూడా సాధారణమే. ఈక్రమంలోనే వకీల్ సాబ్ మే నెలలోనే ఓటీటీలో వచ్చేస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరగగా సినిమా యూనిట్ దాన్ని ఖండించింది. అయితే ఇప్పుడు మే నెల మొదటి వారంలోనే వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రచారం కొంత వాస్తవం.. మరికొంత అవాస్తవం ఉందంటున్నారు ఓటీటీ నిపుణులు. మే మొదటి వారం వకీల్ సాబ్ ఓటీటీలో వస్తాడన్నది అబద్దమని చెప్తుండగా మే నెల చివరి వారంలో అమెజాన్ లో వకీల్ సాబ్ ప్రసారం కావొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా మరో నెల రోజుల తర్వాత వకీల్ ఓటీటీ ఆగమనం అనమాట. అంటే అప్పటికి సినిమా యాబై రోజులు పూర్తవుతుంది. దీంతో ఇటు నిర్మాతలకు.. అటు అమెజాన్ ఓటీటీకి న్యాయం జరుగుతుందని నిపుణుల మాట. ఏదైనా ఓటీటీలో విడుదల అనగానే మరోసారి అభిమాన హీరో సినిమాను చూడొచ్చని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.