NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషన్ తరువాత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా.. షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల తారక్ ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: NTR30: ఎన్టీఆర్ విధ్వంసానికి నేల సరిపోదట.. నీటిలో వెతుకుతున్న చిత్ర యూనిట్!
ప్రముఖ ఫిష్ డెలివరీ కంపెనీ లిసియస్ను ప్రమోట్ చేసేందుకు తారక్ ఇటీవల ఓ యాడ్ చేశాడు. ఈ యాడ్‌లో తారక్ సరికొత్త లుక్ తో కనిపించగా, ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ యాడ్‌లో తారక్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా, ఈ యాడ్ కోసం తారక్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. లిసియస్ యాడ్‌లో నటించినందుకు తారక్ రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: NTR : చేపలు అమ్ముతున్న జూనియర్ ఎన్టీఆర్..
అయితే మిగతా స్టార్ హీరోలు ఒక్క యాడ్ కోసం తీసుకునే రెమ్యునరేషన్‌తో పోల్చితే ఇది తక్కువే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్. మిగతా హీరోలు ఒక్కో యాడ్ కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కానీ, తారక్ లిసియస్ యాడ్ కోసం తీసుకున్నది చాలా తక్కువేనని వారు అంటున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో తారక్ చేసింది కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే అని, ఆయన నుంచి మరో పాన్ ఇండియా మూవీ వస్తే, ఆటోమేటిక్‌గా యాడ్ రెమ్యునరేషన్ పెంచేస్తాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.