NTR30: ఎన్టీఆర్ విధ్వంసానికి నేల సరిపోదట.. నీటిలో వెతుకుతున్న చిత్ర యూనిట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను కొరటాల చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

NTR30: ఎన్టీఆర్ విధ్వంసానికి నేల సరిపోదట.. నీటిలో వెతుకుతున్న చిత్ర యూనిట్!

NTR30 First Schedule To Begin With Action Sequence In Waters

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను కొరటాల చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేసేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

NTR30: లొకేషన్ వేటలో NTR30 టీమ్.. ఎక్కడున్నారంటే?

కాగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమా నేపథ్యం నీరు కావడంతో, ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నేలపై కాకుండా నీటిలో చేయాలని కొరటాల అండ్ టీమ్ భావిస్తుందట. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు కొన్ని ఐల్యాండ్‌లను చుట్టేస్తున్నారట. మంచి లొకేషన్ ఫిక్స్ కాగానే, అక్కడ ఈ సినిమాకు సంబంధించిన తొలి యాక్షన్ బ్యాంగ్‌ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.

NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..

ఇక తారక్ విధ్వంసాన్ని ఈ సినిమాలో మరో లెవెల్‌లో చూపించబోతున్నాడట కొరటాల. ఆయన ఈ సినిమాతో సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్లాన్ చేస్తుండగా, తారక్ పాత్రను అల్టిమేట్‌గా తీర్చిదిద్దుతున్నాడట. అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు.