Lenin : వాయిదా పడిన లెనిన్.. నన్ను అడిగారు అంటూ నాగార్జున ట్వీట్ వైరల్.. కొత్త డేట్ ఇదే..
తాజాగా నాగార్జున లెనిన్ సినిమా వాయిదా పడిందంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. (Lenin)
Lenin
Lenin : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా లెనిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు. లెనిన్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 26 రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. తాజాగా నాగార్జున లెనిన్ సినిమా వాయిదా పడిందంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
Also See : Samantha : భర్త కోసం పూరీలు చేసిన సమంత.. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ చూశారా..?
నాగార్జున తన ట్విట్టర్ లో.. లెనిన్ టీమ్ నా దగ్గరకు ఒక రిక్వెస్ట్ తో వచ్చారు. వంద శాతం బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి, ఇంకా స్పెషల్ గా రెడీ చేయడానికి కొంత సమయం అడిగారు. వాళ్ళ ప్యాషన్ నన్ను ఎస్ చెప్పేలా చేసింది. మనోడు జులై 10న వస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక కొత్త అఖిల్ ని చూస్తారు. లెనిన్ అనుభవానికి రెడీ అవ్వండి అని తెలిపారు. దీంతో లెనిన్ సినిమా జూన్ 26 బదులు జులై 10న రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
Team #Lenin came to me with a request.
They asked for a little more time to give their absolute 100% and create something very special.
Their passion and spirit made me say yes.
మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!
Get ready for the #Lenin…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2026
