NTR: తారక్ మళ్లీ ఆ మాంత్రికుడి వలలో పడ్డాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.

Ntr Trivikram Combo To Repeat

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ మూవీతో తారక్ తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, తారక్ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

NTR: రామయ్య.. ఈ మౌనం ఎందుకయ్యా?

తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోయే సినిమాను తొలుత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కాకముందే ఆగిపోయింది. దీంతో తారక్ తన 30వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వెంటనే మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమాను అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశాడు.

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. దీనికి కూడా బలమైన కారణమే ఉంది. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నాడు ఈ డైరెక్టర్. అయితే ఆచార్య చిత్రాన్ని రిలీజ్ చేసిన తరువాతే తారక్‌తో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ డైరెక్టర్.

Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

అటు తారక్ కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాతే తన 30వ చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తప్పుకున్న త్రివిక్రమ్‌తో తారక్‌కు కొన్ని విబేధాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాదని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్-తారక్ సన్నిహితంగా ఉంటున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అంతేగాక తారక్ కోసం త్రివిక్రమ్ మరోసారి అదిరిపోయే కథను రెడీ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నాడట.

గతంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినా కూడా తారక్‌ను తన బుట్టలో వేసుకోవడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి నిజంగానే మరోసారి త్రివిక్రమ్-తారక్ కాంబోలో సినిమాను మనం చూడబోతున్నామా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.