NTR: రామయ్య.. ఈ మౌనం ఎందుకయ్యా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

NTR: రామయ్య.. ఈ మౌనం ఎందుకయ్యా?

Ntr Silent On His Next Movie

Updated On : March 11, 2022 / 1:50 PM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన జక్కన్న.. ఈ సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈసారి ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆతృతగా చూస్తున్నారు.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

అయితే ఈ మూవీలో తారక్‌తో పాటు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినిమా ఎక్స్‌పర్ట్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే హీరో రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేశాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లో 15వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

మరోపక్క తారక్ కూడా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. చెర్రీ తన నెక్ట్స్ సినిమా షూటింగ్‌తో జోరు మీద ఉండగా, తారక్ మాత్రం ఇంకా తన నెక్ట్స్ మూవీని ఎందుకు స్టార్ట్ చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే తారక్ కేవలం ఆర్ఆర్ఆర్ సక్సెస్ పైనే దృష్టి పెట్టాడని, ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా హీరోగా మారుతున్న కారణంగా తారక్ ఈ సినిమా రిజల్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

RRR: ప్రమోషన్ క్రేజ్.. మళ్ళీ రాబోతున్న రాముడు-భీముడు

ఒకవేళ తారక్ పాత్రకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వస్తే, అది ఖచ్చితంగా తన నెక్ట్స్ మూవీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. అందుకే RRR సక్సెస్ అయ్యాకే తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడట. ఇక కొమురం భీం పాత్ర కోసం తారక్ ఏ విధంగా కష్టపడ్డాడో మనం ఇప్పటికే మేకింగ్ వీడియోల్లో చూశాం. మరి ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్‌కు జనం ఎలాంటి కితాబిస్తారో తెలియాలంటే, మార్చి 25 వరకు ఎదురుచూడాల్సిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.