prophet row: నిజం చెప్పినందుకు నురూప్ శర్మకు బెదిరింపులు: ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న వేళ ఆమెకు ఇప్పటివరకు బహిరంగంగా ఎవ్వరూ మద్దతు ప్రకటించలేదు. అయితే, తాజాగా, నురూప్ శర్మ పేరును ప్రస్తావించకుండా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- T Venkateshwarlu
- Updated on- June 10, 2022 / 04:33 PM IST
Pragya Thakur
prophet row: మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న వేళ ఆమెకు ఇప్పటివరకు బహిరంగంగా ఎవ్వరూ మద్దతు ప్రకటించలేదు. అయితే, తాజాగా, నురూప్ శర్మ పేరును ప్రస్తావించకుండా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ”నిజాన్ని చెప్పడమే తిరుగుబాటు చేయడం అయితే నేను కూడా తిరుగుబాటుదారునే” అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
అలాగే, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిజం చెబితే కొందరికి కోపం వస్తుందని అన్నారు. అటువంటి వారికి కమ్యూనిజం చరిత్ర ఉందని చెప్పారు. గతంలో కమలేశ్ తివారీ ఓ విషయాన్ని చెబితే, ఆయనను చంపేశారని అన్నారు. ఇప్పుడు మరో వ్యక్తి (నురూప్ శర్మ) ఓ విషయం చెప్పారని, ఆమెకూ బెదిరింపులు వస్తున్నాయని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అన్నారు. భారతదేశం హిందువులదని, సనాతన ధర్మం ఎప్పటికీ ఇక్కడే నిలిచి ఉంటుందని చెప్పారు. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కాగా, మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నురూప్ శర్మపై ఇప్పటికే బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
