Prophet row: హైద‌రాబాద్ స‌హా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌నలకు దిగిన‌ ముస్లింలు.. తీవ్ర ఉద్రిక్తత

హైద‌రాబాద్‌లోని చార్మినార్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు. కొన్ని రోజుల క్రితం మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయడంతో వారిపై బీజేపీ పార్టీప‌రంగా చర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే.

Prophet row: హైద‌రాబాద్ స‌హా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌నలకు దిగిన‌ ముస్లింలు.. తీవ్ర ఉద్రిక్తత

Prophet row: హైద‌రాబాద్‌లోని చార్మినార్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు. కొన్ని రోజుల క్రితం మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయడంతో వారిపై బీజేపీ పార్టీప‌రంగా చర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వారిద్ద‌రిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ, దేశంలో ఈ వివాదం ఇప్ప‌ట్లో ఆగేట‌ట్లు లేదు. శుక్ర‌వారం ప్రార్థ‌నల అనంత‌రం మ‌సీదుల వ‌ద్దే ముస్లింలు నిర‌స‌న‌ల‌కు దిగారు.

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం

ఢిల్లీలోని జామా మ‌సీదుతో పాటు ప‌లు మ‌సీదుల వ‌ద్ద ముస్లింలు నిర‌స‌న తెలుపుతున్నారు. అలాగే, యూలోని ప్ర‌యాగ్ రాజ్, ష‌హార‌న్‌పూర్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళ‌నలకు దిగారు. నురూప్ శ‌ర్మ‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. జామా మ‌సీదు వ‌ద్ద దాదాపు 1500 మంది ఆందోళ‌న‌కు దిగారు. అక్క‌డ‌కు దాదాపు 300 మంది పోలీసులు చేరుకున్నారు.

Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. ప్ర‌యాగ్ రాజ్‌లో ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వ‌డంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల అనంత‌రం ముస్లింలు ఊహించ‌ని విధంగా ఆందోళ‌న‌ల‌కు దిగ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.