Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో బేర‌సారాలు ఆడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార‌స్వామి ఆరోపించారు.

Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

Rajya Sabha Polls: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్ పార్టీ బేర‌సారాలు ఆడుతోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార‌స్వామి ఆరోపించారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని సిద్ధ‌రామ‌య్య కూడా ఇటీవ‌లే వ్యాఖ్యానించారు. బెంగ‌ళూరులో కుమార‌స్వామి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ… జేడీఎస్‌కు ఓటు వేయొద్ద‌ని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ‌రామ‌య్య త‌మ పార్టీ నేత‌ల‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని, హ‌స్తం పార్టీకే ఓటు వేయాల‌ని చెబుతున్నార‌ని అన్నారు.

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం

జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు సిద్ధ‌రామ‌య్య ఓ లేఖ రాశార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కూడా కుమార‌స్వామి స్పందించారు. నేడు సిద్ధ‌రామ‌య్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను లేఖ రాయ‌లేద‌ని చెప్పార‌ని కుమార‌స్వామి అన్నారు. అయితే, ఇప్ప‌టికే ఆ లేఖ‌ను సిద్ధ‌రామ‌య్య ట్విట‌ర్‌లోనూ పోస్ట్ చేశార‌ని గుర్తు చేశారు. నిన్న లేఖ రాశాన‌ని చెప్పిన సిద్ధ‌రామ‌య్య నేడు రాయ‌లేద‌ని అంటున్నార‌ని, ఈ తీరు ఆయ‌న ద్వంద్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తోంద‌ని చెప్పారు.

Rajya Sabha Polls: ఓటు వేసేందుకు న‌వాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌కు అవ‌కాశం ఇవ్వ‌ని కోర్టు

అలాగే, బీజేపీ నేత సీటీ ర‌వి క‌ర్ణాట‌క కాంగ్రెస్ కార్యాల‌యంలో క‌న‌ప‌డ్డార‌ని కుమార‌స్వామి అన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని చెప్పారు. కాగా, రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. 15 రాష్ట్రాల్లోని 57 స్థానాల ఎన్నికలు షెడ్యూల్ వెలువ‌డ‌గా వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావ‌డంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన‌ 16 స్థానాలకు నేడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌, హ‌రియాణా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఓటింగ్ కొన‌సాగుతోంది.