Old Man Burnt Alive: మంత్రాల నెపంతో వృద్ధుడి సజీవ దహనం
ఒక పక్క మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు. ఈ పేరుతో ఇప్పటికీ దురాగతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.
- Narender Thiru
- Published On : June 6, 2022 / 10:59 AM IST
Old Man Burnt Alive
Old Man Burnt Alive: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నాడనే కారణంతో వృద్ధుడిని సజీవ దహనం చేశారు ముగ్గురు వ్యక్తులు. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఈరోల్ల మల్లయ్య (62) అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని, అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు అనుమానం ఉంది. దీంతో మల్లయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆయనను బయటకు లాక్కొచ్చి, బండరాళ్లతో కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో మల్లయ్య సజీవ దహనమయ్యారు.
Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా
అదే సమయంలో అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై మృతుడి కూతురు లావణ్య బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు.
