Mamata
presidential elections: రాష్ట్రపతి ఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు దేశంలోని విపక్ష పార్టీలు మరోసారి సమావేశం నిర్వహించనున్నాయి. ఇటీవల ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ సహా పలువురు విపక్ష పార్టీల నేతలు హాజరైన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి అంశంపైనే జూన్ 21న మరోసారి సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.
congress: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: రాహుల్, ప్రియాంకా గాంధీ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. జూన్ 21న మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో ఈ సమావేశం జరగనుంది. ప్రతిపక్షాల సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరుకానున్నారు. కాగా, విపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం రాజకీయ పార్టీలతో చర్చించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేను నియమించింది. రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న ఎన్నిక జరుగుతుంది.