Balasore train crash : ఒడిశా ప్రజలు 1000మంది ప్రాణాలు కాపాడారు…సీఎం నవీన్ పట్నాయక్ ప్రశంసలు

బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....

Balasore train crash Patnaik

Balasore train crash: బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.(Over 1,000 human lives saved)ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా ఒక్క నిమిషం సీఎం మౌనం పాటించారు. అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశాలోని స్థానిక ప్రజల(Odisha people) కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు.

Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు స్పందించి సహాయక చర్యలకు దిగారని సీఎం చెప్పారు.రెస్క్యూ ఆపరేషన్‌లకు మద్దతునిచ్చిన వ్యక్తులు, రక్తదానం కోసం బారులు తీరిన ప్రజల అరుదైన దృశ్యాలు అమూల్యమైనవని అన్నారు.ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో 1,205 మంది వైద్యాధికారులు చేరిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.‘‘ ఏవైనా విపత్తులు జరిగినపుడు డాక్టర్లు, వైద్య విద్యార్థులు, సాధారణ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడుకుందాం’’ అని నవీన్ పట్నాయక్ చెప్పారు.

Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి పెరిగిందని, ఇప్పటివరకు 205 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని, మిగిలిన 83 మృతదేహాలను గుర్తింపు కోసం ఎయిమ్స్-భువనేశ్వర్ ,ఇతర ఆసుపత్రులలో ఉంచినట్లు సీఎం చెప్పారు. తుపాన్లు, కొవిడ్ మహమ్మారి, ఘోర ప్రమాదాలు వాటిల్లిన సంక్షోభ సమయాల్లో బాగా పనిచేసే సామర్ధ్యాన్ని ఒడిశా ప్రజలకు ఉందని సీఎం నవీన్ పట్నాయక్ వివరించారు.