Bengaluru : 12వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయట.. అద్దెకు ఇల్లు ఇవ్వనన్న ఓనర్

బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకాలంటే మీరు చదువుల్లో మంచి మార్కులతో పాసై ఉండి ఉండాలి. అదేంటి? అంటారా? అది అంతే.. లేదంటే అద్దె ఇల్లు సంగతి మర్చిపోండి.

Bengaluru

Bengaluru :  మీ స్టడీ సర్టిఫికేట్లు, మార్కుల లిస్టులు.. కేవలం ఉద్యోగం సమయంలోనే ఉపయోగపడతాయి అనుకునేరు. ఇప్పుడు అద్దె ఇల్లు కావాలంటే కూడా అవి కంపల్సరీ. అంతేనా మార్కులు కూడా మంచిగా వచ్చి ఉండాలి. లేదంటే ఇంటి యజమాని తిరస్కరిస్తాడు. ఇదేం ఘోరం అనుకోకండి. బెంగళూరులో 12వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని ఇంటి ఓనర్ అద్దెకు ఇల్లు ఇవ్వలేదు మరి.

housing crisis : అద్దె ఇంటి కోసం ఐపీఎల్ మ్యాచ్‌ని వదల్లేదుగా.. బెంగళూరులో ఓ వ్యక్తి ఏం చేసాడో చూడండి

బెంగళూరులో అద్దె ఇంటి కోసం జనాలు పడుతున్న పాట్లు చదువుతూనే ఉన్నాం. అక్కడ అద్దెకు ఇల్లు దొరకాలంటే ఎన్ని అడ్డంకులు దాటాలో తెలుసా? మీకు ఓ ఇల్లు నచ్చుతుంది.. ఇక అక్కడ్నుంచి మొదలు ఓనర్లు ఒక లిస్ట్ బయటకు తీస్తారు. జాబ్ ప్రొఫైల్ మాత్రమే కాదు.. ఏ కాలేజ్ లో చదివారు.. ఏ క్లాస్ లో పాసయ్యారు? లాంటి పరీక్షలతో పాటు సోషల్ మీడియాల ప్రొఫైల్ లు.. మీ చేతి రాతలతో సహా ప్రతీదీ పరీక్షిస్తారు. ఇక అన్నీ మీరు ఇచ్చినా కూడా ఓనర్ తిరస్కరించవచ్చు.

 

మరియు వారు అడిగిన అంశాలు రాసి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఓనర్ అడిగిన ప్రతిదీ పంపినా కూడా మీకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి తిరస్కరించవచ్చును.  యోగేష్ అనే వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. అద్దెకు ఇల్లు కావాలంటూ యోగేష్  బ్రోకర్ బ్రిజేష్ ను సంప్రదించాడు. ఈ విషయంగా వారిద్దరి మధ్యా వాట్సాప్ సంభాషణ జరిగింది. యోగేష్ ఓనర్ అడిగిన ప్రతీదీ బ్రిజేష్ కు పంపాడు. ఫైనల్ గా 12వ తరగతిలో తక్కువ మార్కులు రావడంతో ఓనర్ అద్దెకు ఇల్లు ఇవ్వడానికి తిరస్కరించాడు.  వీరిద్దరి సంభాషణకు సంబంధించిన స్కీన్ షాట్స్ @kadaipaneeeer అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  12వ తరగతిలో ఇంటి యజమాని 90% మార్కులు ఆశిస్తే యోగేష్ కి 75% మాత్రమే మార్కులు రావడంతో అద్దె ఇల్లు తిరస్కరణకు గురయ్యాడు. ఇదేం చోద్యం అనుకున్నా బెంగళూరులో తాజా పరిస్థితి ఇది.

jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్

ఇక ఈ చాట్ చూసిన వాళ్లంతా త్వరలో బెంగళూరులో ప్లాట్ అద్దెకు కావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ లు రాయాలని కొందరు.. ఇంటి ఓనర్ అద్దెకు ఇల్లు ఇవ్వాలని అనుకుంటున్నాడా? లేక తన పిల్లలకు ప్రైవేట్ ట్యూటర్ ని వెతుకుతున్నాడా? అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇలాంటి కథనాలు చదివినవారు బెంగళూరులో జాబ్ వచ్చినా.. అత్యవసర పరిస్థితుల్లో అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా భయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే పేరెంట్స్ పిల్లల కెరియర్ కోసమే కాదు.. భవిష్యత్‌లో వారికి అద్దె ఇల్లు కష్టాలు రాకుండా ఉండేందుకు కూడా మంచి మార్కులు వచ్చేలా చదివించాలేమో.. చూస్తుంటే అలాగే ఉంది పరిస్థితి.