jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్

ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.

jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్

jail restaurant

Updated On : April 10, 2023 / 3:48 PM IST

jail restaurant :  ఈ మధ్యకాలంలో రకరకాల థీమ్స్‌తో హోటల్స్ వెలుస్తున్నాయి. వాటికి వింత వింత పేర్లు కూడా పెడుతున్నారు. థీమ్ కి తగ్గట్లుగా అక్కడ వాతావరణం, వడ్డనలు కూడా జరుగుతున్నాయి. జనాల్ని అట్రాక్ట్ చేయడానికి రెస్టారెంట్ల యజమానులు ఇంకొంచెం ముందుకు వెళ్లి జైలు కాన్సెప్ట్ తో కూడా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. బెంగళూరులో (Bengaluru) అచ్చంగా అది జైలేమో అన్న ఫీల్ ఇస్తున్న జైల్ రెస్టారెంట్ (jail restaurant) ఇప్పుడు వైరల్ అవుతోంది.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

కొత్త ఐడియాలు, సరికొత్త ఆలోచనలతో రెస్టారెంట్లు, బిజినెస్‌లు ప్రారంభిస్తూ బెంగళూరు సిటీ ముందుకు దూసుకుపోతోంది. రీసెంట్‌గా బెంగళూరులో ఓ ఫుడ్ బ్లాగర్ (food blogger) జైలు లాంటి కొత్త రెస్టారెంట్ ను పరిచయం చేస్తూ వీడియో చేశారు. వీడియోలో చూస్తుంటే అది రెస్టారెంటా? లేక నిజంగా జైలా? అనే సందేహం కలగకమానదు. హర్ష్ గోయెంకా (harsh goenka) అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. లోనికి ఎంటర్ అవుతున్నప్పుడు సెంట్రల్ జైల్ అని బోర్డ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లగానే జైలులో ఉన్నట్లు బ్యారక్‌లు కనిపిస్తాయి. ఇక వెయిటర్స్ అంతా పోలీసులు, ఖైదీల డ్రెస్ లు వేసుకుని ఆర్డర్లు తీసుకుంటూ కనిపిస్తారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా రెస్టారెంట్ నిర్వాకుల క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.

Dalai Lama: బాలుడ్ని ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన బౌద్ద మత గురువు దలైలామా

ఈసారి మీరు బెంగళూరు వెళ్లినపుడు ప్రధాన రహదారి 27 మీద హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌ (HSR layout) కి దగ్గరగా ఉన్న ఈ జైలు రెస్టారెంట్ కి వెళ్లడం మాత్రం మర్చిపోకండి.