Dalai Lama: బాలుడ్ని ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన బౌద్ద మత గురువు దలైలామా

ఓ బాలుడ్ని అభ్యంతరకర రీతిలో ముద్దు పెట్టుకోవటమే కాకుండా.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో బౌద్ధ మత గురువు దలైలామాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బాలుడు, బాలుడి కుటుంబ సభ్యులకు దలైలామా క్షమాపణలు చెప్పారు.

Dalai Lama: బాలుడ్ని ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన బౌద్ద మత గురువు దలైలామా

Dalai Lama

Dalai Lama: బౌద్ధ మత గురువు దలైలామా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతని వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై పలువురు విమర్శలు చేశారు. తన వద్దకు ఆశీర్వాదంకోసం వచ్చిన భారతీయ బాలుడ్ని దగ్గరకు తీసుకున్న దలైలామా.. తన నాలుకను నోటితో తాకాలంటూ ఆ బాలుడ్ని కోరడం వివాదాస్పదమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దలైలామా క్షమాపణలు చెప్పారు. బాలుడికి, అతని కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరారు.

China-Dalai Lama: దలైలామాను మీ దేశంలోకి రానిచ్చారో..: శ్రీలంకను బెదిరిస్తున్న చైనా

ఆశీర్వాదంకోసం వచ్చిన భారతీయ యువకుడ్ని దలైలామా దగ్గరకు తీసుకున్నారు. ఆ బాలుడి పెదవులపై ముద్దు పెట్టాడు. అనంతరం బౌద్ధ గురువు తన నాలుకను బయట పెట్టి నీ నోటితో నా నాలుకను తాకుతావా అని అడగడం వీడియోలో వినిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దలైలామా తీరుపై ఆశ్చర్యపోతున్నారు. పలువురు నెటిజన్లు దలైలామా తీరుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ఎవరు చేసిన సహించొద్దని, బౌద్ధ మత గురువును అరెస్టు చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దెత్తున పోస్టులు పెడుతున్నారు.

Dalai Lama: ఇండియానే నా శాశ్వత నివాస ప్రాంతం: బౌద్ధమత గురువు దలైలామా

ఈ ఘటనకు సంబంధించి దలైలామా ట్విటర్ ఖాతా నుంచి ఓ పోస్టు వెలువడింది. ఈ వీడియో క్లిప్‌పై బాలుడికి, బాలుడి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దలైలామా ఎంతో చింతిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.