Pakpm Shehba
Pakistan PM: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను తాను ఓ ‘మజ్నూ’గా అభివర్ణించుకున్నారు. ఉర్దూలో ‘మజ్నూ’ అంటే అవివేకి, బుద్ధిలేనివాడు అనే అర్థాలు ఉన్నాయి. చక్కెర కుంభకోణం కేసులో విచారణ జరుపుతోన్న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) 2008-2018 మధ్య 582 కోట్ల రూపాయలకు పైగా నగదు అక్రమ చలామణి జరిగిందని గుర్తించింది. ఈ కేసులో షెహబాజ్ షరీఫ్, ఆయన కుమారులు హంజా, సులేమాన్ విచారణ ఎదుర్కొంటున్నారు.
PM Modi: 8 ఏళ్ల పాలనపై 31న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ: జైరాం ఠాకూర్
శనివారం విచారణకు హాజరైన షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై వచ్చిన అక్రమ నగదు చలామణీ ఆరోపణల్లో నిజం లేదని న్యాయమూర్తికి చెప్పారు. తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. అంతేగాక, తాను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ వేతనం తీసుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కారును వాడుకునేటప్పుడు కూడా తన సొంత డబ్బుతోనే పెట్రోలు పోయించేవాడినని చెప్పుకొచ్చారు.
Ukraine: డాన్‌బాస్‌లో రష్యా బలగాలను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్
‘‘దేవుడు నన్ను ఈ దేశానికి ప్రధానిని చేశాడు. నేనొక మజ్నూ(అవివేకి)ని. నాకు చట్టబద్ధంగా ఉన్న హక్కును కూడా నేను వినియోగించుకోలేదు. వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలనూ వాడుకోలేదు’’ అని ఆయన అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.