Pakistan PM Shehbaz Sharif: ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని ఆసక్తికర ట్వీట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన టీమిండియా ఫ్యాన్స్..
ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా ఓటమితో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్ 170/0 .. అంటూ ట్వీట్‌లో పాక్ ప్రధాని పేర్కొన్నాడు.
- Harishth Thanniru
- Published On : November 10, 2022 / 10:28 PM IST
Pakistan PM Shehbaz Sharif
Pakistan PM Shehbaz Sharif: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలోభాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా చేధించారు.
T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..
ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా ఓటమితో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్ 170/0 .. అంటూ ట్వీట్‌లో పాక్ ప్రధాని పేర్కొన్నాడు. గతేడాది ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో టీమ్ఇండియా 10వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయాన్ని గుర్తుచేస్తూ పాక్ ప్రధాని ఈ ట్వీట్ చేసినట్లుగా కనిపిస్తోంది.. అంతేకాక.. వరల్డ్ కప్ తాజా ఎడిషన్‌లో పాక్ వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్‌లో చూడబోతున్నామని అన్నాడు.
So, this Sunday, it’s:
152/0 vs 170/0
🇵🇰 🇬🇧 #T20WorldCup
— Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022
పాకిస్థాన్ ప్రధాని ట్వీట్‌కు టీమ్ఇండియా ఫ్యాన్స్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాక్ ప్రధాని ట్వీట్ వ్యగ్యంగా ఉండటంతో.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమ్‌ఇండియా సెమీ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. పాకిస్థాన్ అలా వచ్చిందా .. అంటూ ప్రశ్నిస్తూ కౌంటర్ ఇచ్చారు.
