PawanKalyan: తుపాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

అసని తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు.

PawanKalyan: అసని తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అసని తుపాను ప్రభావానికి గురయ్యే ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. అసని తుపాను గురంచి బుధవారం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందించారు.

Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

‘‘వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. అనేక గ్రామాల్లో ఇంకా కళ్లాల్లోనే ధాన్యం ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలి. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారు. పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలి. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలి’’ అని పవన్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు