Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

అసని తుపాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

Indian Railway

Updated On : May 11, 2022 / 2:54 PM IST

 

 

Asani Cyclone: అసని తుపాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 37 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

రద్దు అయిన రైళ్ల సర్వీసు వివరాలిలా ఉన్నాయి. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్‌, నర్సాపూర్‌-విజయవాడ, నర్సాపూర్‌-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్‌, భీమవరం జంక్షన్‌-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్‌ మధ్య నడుస్తున్న రైళ్లను రద్దు చేశారు.

ఇవే కాకుండా మరికొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. వీటితో పాటు విశాఖపట్నం మీద నుంచి వచ్చే రైళ్లన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిందని ప్రకటించారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు.