Parveen Kaswan, IFS : ప్రాణాపాయంలో ఉన్న జింకకు ఆక్సిజన్ అందించిన వ్యక్తి.. IFS ఆఫీసర్ పోస్ట్ చేసిన ఫోటో వైరల్

ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.

Parveen Kaswan, IFS :  మనుష్యుల్లో సాటివారికి ప్రమాదం జరిగితే స్పందించడానికి సంకోచిస్తారు.. ఇక జంతువులకు దగ్గరుండి సపర్యలు చేయడం అంటే చాలా దయగల హృదయం ఉండాలి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఓ జింకకు ఆక్సిజన్ సిలెండర్ అమర్చి సాయం అందించాడు ఓ వ్యక్తి. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

Amazon Farest : అమెజాన్ అడవుల్లో తప్పిపోయి..30 రోజులకు బతికిబయటపడ్డ యువకుడు..ఏం తిన్నాడో ఏం తాగాడో తెలిస్తే వాంతి రావాల్సిందే..

అయితే ఎండలు.. లేదంటే వానలు వాతావరణంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. మనుష్యులే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక జంతువుల పరిస్థితి. వాటిని పట్టించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. రీసెంట్ గా ఓ జింక ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటం గమనించాడు ఓ వ్యక్తి . వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్‌ను అమర్చి దాని దగ్గరే కూర్చుని సేవ చేశాడు. జింకకు వైద్య సాయం అందిస్తున్న ఆ వ్యక్తి ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ ప్రపంచం పట్ల దయని కలిగి ఉండండి’.. అనే క్యాప్షన్ ని కూడా జత చేశారు. ఈ ఫోటో చాలామందిని మనసుల్ని టచ్ చేసింది.

Viral Video : ఆవులపై దాడి చేయబోయిన పులి.. అంతలో ఎంట్రీ ఇచ్చిన అడవిపిల్లి.. ఆ తరువాత ఏం జరిగింది?

మాటలు రాని జీవాలన్నీ అతడిని ఆశీర్వదిస్తాయి అని కొందరు.. అతను చేసిన మంచి పనికి అభినందనలు అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. మనుష్యుల పట్లే కాదు.. జంతువుల పట్ల కూడా మానవత్వం చాటుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఆపదలో ఉన్న మూగజీవాలకు సైతం సాయం చేయాలనే గొప్ప ఆలోచనకు పురికొల్పుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు