Viral Video : ఆవులపై దాడి చేయబోయిన పులి.. అంతలో ఎంట్రీ ఇచ్చిన అడవిపిల్లి.. ఆ తరువాత ఏం జరిగింది?

ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.

Viral Video : ఆవులపై దాడి చేయబోయిన పులి.. అంతలో ఎంట్రీ ఇచ్చిన అడవిపిల్లి.. ఆ తరువాత ఏం జరిగింది?

tiger attacking a cow

Viral Video :  పులి దూడ వెంట పడింది.. అంతలో ఓ అడవి పిల్లి కూడా ఎంట్రీ ఇచ్చింది.. అంతే నెక్ట్స్ సీన్ ఏం జరిగి ఉంటుంది? ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Operation Tiger T108 : నల్లమల అడవిలో ‘ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్’ పిల్లికూనల వద్దకు రాని తల్లి.. ఆందోళనలో అధికారులు

ఇటీవల కాలంలో పులలు జనవాసాల్లోకి రావడం మనుష్యులు, పశువుల ప్రాణాలు తీయడం ఇక ఫారెస్ట్ అధికారుల్ని అవి ముప్పు తిప్పలు పెట్టడం లాంటి అనేక సంఘటనలు చూసాం. తాజాగా ఓ మైదానంలో పశువులపై పులి పంజా విసిరిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పులి పశువులపై దాడి చేయడం కోసం గ్రౌండ్లో రౌండ్లు తిరగడం మొదలుపెట్టింది. అంతలో ఓ అడవి పిల్లి కూడా ఎంట్రీ ఇచ్చి ఓ ఆవును పరుగులు పెట్టించింది. అదే సమయానికి ఓ ఆవు అడవిపిల్లిపై దాడి చేయడంతో దూడ తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.

ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. భారత దేశంలో 75 శాతం పులుల సంఖ్య ఉందని.. వీటిని మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వీటిని సాధు జంతువుల్లా సాకడం ద్వారా కూడా వీటి సంఖ్యను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Bandhavgarh: పులులు తిరిగే అడవిలో బయటపడ్డ పురాతన ఆలయాలు, బౌద్ధారామాలు, గుహలు

ఈ వీడియోపై పలువురు స్పందించారు. పులుల్ని చూస్తే కన్నుల పండుగగా ఉందని.. అయితే జంతువులపై అవి చేసే దాడుల్ని నియంత్రించాలని కొందరు. వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని.. అడవులు నరికివేయకుండా వాటిని పరిధిని పెంచే దిశగా కృషి చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశంలో అడవి పిల్లుల సంఖ్య కూడా పెరుగుతోంది.