Missing Boy Found : పశువుల మేతకు వెళ్లి తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే

కడప జిల్లా బద్వేల్ లోని టేకురుపేట అటవీప్రాంతంలోని బాలుడి మిస్సంగ్ కలకలం రేపింది. అటవీ సిబ్బంది సహాయంతో గ్రామస్తులు, పోలీసులు రాత్రంతా అడవిలో గాలించారు. ఉదయం బాలుడి ఆచూకీ లభించింది.

Missing Boy Found : పశువుల మేతకు వెళ్లి తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే

BOY (1)

Updated On : January 4, 2023 / 12:57 PM IST

Missing Boy Found : కడప జిల్లా బద్వేల్ లోని టేకురుపేట అటవీప్రాంతంలోని బాలుడి మిస్సంగ్ కలకలం రేపింది. నిన్న సాయంత్రం తండ్రితో కలిసి పశువుల మేతకు అడవికి వెళ్లిన బాలుడు ఫారెస్టులోనే తప్పిపోయాడు. దీంతో ఎనిమిదేళ్ల బాలుడు రాత్రంతా అడవిలోనే ఉన్నాడు.

అటవీ సిబ్బంది సహాయంతో గ్రామస్తులు, పోలీసులు రాత్రంతా అడవిలో గాలించారు. ఉదయం బాలుడి ఆచూకీ లభించింది. అడవిలో పది కిలో మీటర్ల దూరంలో బాలుడిని కనిపెట్టారు.

Telangana : హైదరాబాద్ లో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్..ఆందోళనలో తల్లిదండ్రులు

బాలుడిని రక్షించినందుకు అటవీ సిబ్బందికి బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. తమ కొడుకు ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.