Bandhavgarh: పులులు తిరిగే అడవిలో బయటపడ్డ పురాతన ఆలయాలు, బౌద్ధారామాలు, గుహలు

1938లో పురావస్తు శాస్త్రవేత్త ఎన్.పీ.చక్రవర్తి చివరి సారిగా ఇక్కడ పరిశోధనలు చేశారు. ఇక, తాజాగా బయటపడ్డ కట్టడాల గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంధావ్‭గఢ్‭కు కొంత దూరంలో ఉన్న కౌశమి, మధుర, పావట, వేజబరడ, సపటనాయిరికా వంటి నగరాలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని, అయితే ఇది ఊహాజనితమై కూడా ఉండవచ్చని తెలిపారు

Bandhavgarh: పులులు తిరిగే అడవిలో బయటపడ్డ పురాతన ఆలయాలు, బౌద్ధారామాలు, గుహలు

Ancient temples, Buddhist monasteries, caves found in MP's Bandhavgarh Tiger Reserve

Bandhavgarh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బంధావ్‭గఢ్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పురాతన ఆలయాలు, బౌద్ధారామాలు, గుహలు బయటపడ్డాయి. భారత పురావస్తు శాఖ తాజాగా వీటిని కనుగొంది. కాగా, ఇవి 2వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద కాలంలోనివని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయమై భారత పురావస్తు శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘పురావస్తు టీం తాజాగా పురాతన కట్టడాలను కొనుగోంది. ఇందులో 26 ఆలయాలు, 26 గుహలు, 2 మఠాలు, 2 ఆజ్ఞ స్థూపాలు, 24 శాసనాలు, 46 శిల్పాలతో పాటు 19 నీటి నిర్మాణాలు, చెల్లాచెదురైన ఇతర అవశేషాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

బంధావ్‭గఢ్ టైగర్ రిజర్వు ఫారెస్టు 170 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాగా, 1938 అనంతరం ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ పరిశోధనలు చేపట్టింది. 1938లో పురావస్తు శాస్త్రవేత్త ఎన్.పీ.చక్రవర్తి చివరి సారిగా ఇక్కడ పరిశోధనలు చేశారు. ఇక, తాజాగా బయటపడ్డ కట్టడాల గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంధావ్‭గఢ్‭కు కొంత దూరంలో ఉన్న కౌశమి, మధుర, పావట, వేజబరడ, సపటనాయిరికా వంటి నగరాలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని, అయితే ఇది ఊహాజనితమై కూడా ఉండవచ్చని తెలిపారు. గణితాలు, శిల్పాలు, నీటి వనరులు, బ్రాహ్మీ, నగరి వంటి పాత లిపిలోని కుడ్య శాసనాలు ఇక్కడ కనిపించినట్లు అధికారులు వెల్లడించారు.

Congress President Poll: ఒకే ఒరలో రెండు కత్తులు.. దిగ్విజయ్ సింగ్‭ను కలుసుకున్న శశి థరూర్