Congress President Poll: ఒకే ఒరలో రెండు కత్తులు.. దిగ్విజయ్ సింగ్‭ను కలుసుకున్న శశి థరూర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్‭ను శశి థరూర్ కలుసుకున్నారు. దిగ్విజయ్ పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు

Congress President Poll: ఒకే ఒరలో రెండు కత్తులు.. దిగ్విజయ్ సింగ్‭ను కలుసుకున్న శశి థరూర్

Congress leader Digvijaya Singh met party MP Shashi Tharoor

Congress President Poll: మామూలుగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒక చోటుకు రాలేరు. అన్నిసార్లు వైరి పార్టీల మధ్యే ఈ పోరు ఉండదు. సందర్భాల్ని బట్టి ఒకే పోటీలో అనేక మంది ప్రత్యర్థులు ఉంటారు. వీరు ఒకరికొరకు కలుసుకోవడానికి, ఒక చోటులో కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నేపథ్యంలో ఇరు ప్రత్యర్థులు దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాస్తవానికి వీరి మధ్య వ్యక్తిగత వైరం ఏమీ లేదు. కేవలం పోటీలో ఉన్న ప్రత్యర్థులే. అయినప్పటికీ ఇలా కలుసుకోవడం విశేషం. ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో ఎప్పుడో కానీ కనిపించవు. ఎందుకంటే పదవులకు అడ్డొచ్చే వారిపై వ్యక్తిగత వైరం పెంచుకోవడం రాజకీయ నేతలకు అలవాటే. కొంత మంది నేతలు ఇలాంటివేవీ పట్టించుకోకుండా ప్రత్యర్థులతో సైతం కలిసిపోతుంటారు.

Opposition Alliance: విపక్షాల కూటమిలో చేరేందుకు BSP ఒకే.. కాకపోతే ఒక్క షరతు!

ఇకపోతే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్‭ను శశి థరూర్ కలుసుకున్నారు. దిగ్విజయ్ పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ ఒక్కరో గెలవరని, కాంగ్రెస్ ఉమ్మడిగా గెలుస్తందని థరూర్ అన్నారు.

దిగ్విజయ్‭ను కలిసిన సందర్భంలో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఈరోజు మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్‭ను కలిశాను. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడాన్ని స్వాగిస్తున్నాను. ఈ ఎన్నికల్లో మేము ప్రత్యర్థులుగా పోటీకి దిగడం లేదు. సహచరులుగా స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. మాలో ఎవరో గెలవడం కాకుండా కాంగ్రెస్ గెలవాలని మేం ఇద్దరం బలంగా భావిస్తాం’’ అని ట్వీట్ చేశారు.

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై గెహ్లాట్ సంచలన ప్రకటన