Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై గెహ్లాట్ సంచలన ప్రకటన

రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్‭నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దానిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని అన్నారు.

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై గెహ్లాట్ సంచలన ప్రకటన

I decided to not contest the elections says Gehlot on Congress president poll

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వాస్తవానికి రాహుల్ గాంధీని పోటీ చేయాలని తాను కోరానని, ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతోనే తాను బరిలోకి దిగానని అన్న ఆయన.. ప్రస్తుతం సొంత రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు తనను రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కొనసాగించే విషయంపై కూడా పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని అన్నారు. గురువారం ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

‘‘కొద్ది రోజుల క్రితం కొచ్చిలో రాహుల్ గాంధీని కలుసుకున్నాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరాను. కానీ అందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దీంతో నేను పోటీ చేస్తానని చెప్పాను. కానీ ప్రస్తుత పరిస్థితుల (రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం) నేపథ్యంలో ఈ పోటీ చేయాలని అనుకోవడం లేదు. ఇలాంటి వాతావరణంలో పోటీలో ఉండకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను’’ అని గెహ్లాట్ అన్నారు. ఇక రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్‭నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దానిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని అన్నారు.

Opposition Alliance: విపక్షాల కూటమిలో చేరేందుకు BSP ఒకే.. కాకపోతే ఒక్క షరతు!